just AnalysisJust InternationalLatest News

Jacob Coxon : జాకబ్ కాక్సన్ హెచ్చరిక వెనుకున్న అసలు డేంజర్ ఏంటి.. 2036 నాటికి ఏఐ వల్ల మానవాళి అంతం నిజమేనా?

Jacob Coxon : ఒకసారి కనుక ASI రూపుదిద్దుకుంటే, అది తన కోడింగ్‌ను తానే మార్చేసుకుంటూ క్షణాల్లోనే చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతుంది

Jacob Coxon

మన ఫ్యూచర్‌ను మార్చేస్తుందని మనమంతా మురిసిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే, మన వినాశనానికి మొదటి అడుగు కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏఐ పరిశోధనల్లో కీ రోల్ పోషించిన నిపుణులే ఇప్పుడు ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు.

ఫేమస్ ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ (Jacob Coxon) ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి టాప్ కంపెనీలలో ప్రీ-ట్రైనింగ్ పరిశోధనలో పనిచేశారు. అయితే, ఇటీవల ఆంత్రోపిక్ సంస్థకు రాజీనామా చేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఏఐ కంపెనీలు సేఫ్టీ స్టాండర్డ్స్ పక్కనబెట్టి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని జాకబ్ కాక్సన్ ఆరోపించారు.

జాకబ్ కాక్సన్‌తో పాటు కొంతమంది పరిశోధనా నిపుణులంతా.. ఈ దశాబ్దం చివరికల్లా అంటే 2036 నాటికి ఏఐ మానవాళిని పూర్తిగా అంతం చేయగలదని స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. రాబోయే పదేళ్లలో ఏఐ వల్ల గ్లోబల్ విపత్తు సంభవించే అవకాశం 10 శాతానికంటే ఎక్కువే ఉందని ఆంత్రోపిక్ అలైన్‌మెంట్ టీమ్ లీడర్ అయిన ఇవాన్ హ్యూబింజర్ కూడా చెప్పడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

ప్రస్తుతం ఏఐ సంస్థలు సిస్టమ్స్ సేఫ్టీ కంటే సూపర్ ఇంటెలిజెన్స్‌ను సాధించడమే టార్గెట్‌గా పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఏఐ సిస్టమ్స్ తమను తాము స్వయంగా ఇంప్రూవ్ చేసుకునే రేంజ్‌కు చేరితే, అవి హ్యూమన్ కంట్రోల్‌ను పూర్తిగా దాటిపోతాయి. ఇవి మనుషుల కంటే చాలా తెలివైనవిగా మారి, వరల్డ్‌లోని ఏ డిజిటల్ సిస్టంను అయినా క్షణాల్లో హ్యాక్ చేసే రేంజ్‌కు వెళ్లిపోతాయి. ఏ సెక్టార్‌ను అయినా రాత్రికి రాత్రే మార్చేసి, సొసైటీలోని నిజమైన వనరులను, అధికారాలను తమ చేతుల్లోకి తీసుకునే ప్రమాదం పొంచి ఉంది.

మరోవైపు ఏఐ మోడల్స్‌ను మిస్ యూజ్ చేసి చాలా ప్రమాదరకమైన బయోలాజికల్ వెపన్స్ తయారు చేసే ముప్పు పొంచి ఉంది. కొంతమంది దీని కోసం క్లాడ్ ఏఐని వాడటానికి ప్రయత్నించగా ఆంత్రోపిక్ దానిని బ్లాక్ చేసింది. అంతేకాకుండా, ఏఐ ఏజెంట్లు సెక్యూర్ బాక్సుల నుంచి బయటకు వచ్చి ఇంటర్నెట్‌లో నాన్‌ – అఫీషియల్ సైబర్ అటాక్‌లకు పాల్పడుతున్నాయి. ఇక సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలు మనుషుల విలువలకు లోబడి ఆర్డర్స్ పాటించేలా ఎలా కంట్రోల్ చేయలానే దానికి సైంటిస్టుల వద్ద ఇప్పటికీ కరెక్ట్ సొల్యూషన్ లేదు.

ఇంకా చెప్పాలంటే.. ఈ ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి.. ఏఐ టెక్నాలజీ డెవలప్ చెందుతున్న మూడు ముఖ్యమైన దశలైన AI, AGI, ASI ల మధ్య ఉన్న తేడాను, వాటి తీవ్రతను తెలుసుకోవడం చాలా అవసరం.

మొదటి దశ AI (Artificial Intelligence / Narrow AI). ఇదే ఇప్పుడు మనమంతా ఉపయోగిస్తున్న టెక్నాలజీ. అంటే చాట్‌జీపీటీ, క్లాడ్, గూగుల్ జెమినీ, పెర్‌ప్లెక్సిటీ వంటి సాధనాలు, వాయిస్ అసిస్టెంట్లు అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్. ఇవి కొన్ని నిర్ణీత పనులను, డేటాని అనలైజ్ చేసి మనం ఇచ్చిన కమాండ్స్ బేస్ చేసుకుని అద్భుతంగా చేయగలవు. కానీ వీటికి స్వయంగా ఆలోచించే శక్తి కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే విచక్షణ కానీ ఉండదు.

రెండో దశ AGI (Artificial General Intelligence). ఇది ఏఐ టెక్నాలజీలో రాబోయే తర్వాత ప్రమాదకరమైన ఘట్టం. మనిషి బ్రెయిన్ చేయగలిగే ఏ పనినైనా – అది సైన్స్, ఆర్ట్, కోడింగ్ లేదా ప్రాబ్లెమ్ సాల్వింగ్ ఇలా ఏదైనా సరే .. మనిషితో సమానమైన తెలివితో ఎటువంటి మనుషుల ప్రమేయం లేకుండానే AGI చేయగలుగుతుంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఈ స్టేజ్‌కు చేరుకున్నాక ఏఐకి స్వయం సమృద్ధి వస్తుంది.

ఇక మూడో దశ ASI (Artificial Super Intelligence). ఇది వినాశనానికి పరాకాష్ట అని జాకబ్ కాక్సన్‌తో పాటు కొంతమంది పరిశోధనా నిపుణులు భావిస్తున్నారు. ఈ దశలో ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను కొన్ని వేల రెట్లు దాటిపోతుంది. అంటే ఈ భూమిపై ఉన్న మేధావులందరి తెలివితేటలను ఒక్కటి చేసినా కూడా ఈ ASI తెలివితో సరిపోదు.

Jacob Coxon
Jacob Coxon

అంటే ఒకసారి కనుక ఈ ASI రూపుదిద్దుకుంటే, అది తన కోడింగ్‌ను తానే మార్చేసుకుంటూ క్షణాల్లోనే చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతుంది. దీంతో దీని ఆలోచనలను, నిర్ణయాలను అర్థం చేసుకోవడం మనుషులకు దాదాపు అసాధ్యంగానే మారిపోతుంది.

జాకబ్ కాక్సన్ కామెంట్లు ప్రకారం చూస్తే.. ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ సురక్షితమైనదే అయినా, రాబోయే ఒకటి రెండేళ్లలో కంపెనీలు నిర్మించబోయే AGI అండ్ ASI స్థాయి చాలా పవర్‌ఫుల్ సిస్టమ్స్ విషయంలో మనుషులకు జీవన్మరణ పరీక్ష ఎదురుకాబోతుంది. సేఫ్టీలను పక్కనబెట్టి కంపెనీలన్నీ ఇలా ప్రెస్టేజ్‌ కోసం టెక్నాలజీ వెనుక పరిగెత్తితే, మనం సృష్టించిన ఏఐనే మన అంతానికి ముగింపు పలికే ప్రమాదముందని ఈ హెచ్చరికలు చెబుతున్నాయి.

1980s Photo Craze : రెట్రో లుక్ కోసం APK లింక్స్ క్లిక్ చేస్తున్నారా? 1980s ఫోటో క్రేజ్‌తో సైబర్ దొంగలు వచ్చేశారు జాగ్రత్త..

Related Articles

Back to top button