Just Andhra PradeshLatest News

Murasu Cyclone : ఏపీకి మురసు తుపాను ముప్పు..బంగాళాఖాతంలో దూసుకొస్తున్న వాయుగుండం

Murasu Cyclone : బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం త్వరలో మురసు తుపానుగా మారనుంది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుపాను ప్రభావం, భారీ వర్షాలు, మత్స్యకారుల హెచ్చరికల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Murasu Cyclone

ఏపీ ప్రజలకు అర్నాబ్ తుపాన్ భయం వీడకముందే మరో తుపాను గండం పొంచి ఉందన్న వార్త బెంబేలెత్తిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఊహించిన దాని కంటే స్పీడ్‌గా బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందింది.

ప్రస్తుతం చెన్నైకి 1,140 కి.మీ. మచిలీపట్నానికి 1,200 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఈ వాతావరణ వ్యవస్థ.. రాగల కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. ఇక నవంబర్ 1వ తేదీ సాయంత్రం కల్లా మరింత శక్తివంతమై మురసు తుపాను(Murasu Cyclone)గా బలపడబోతోందని హెచ్చరికలను జారీ చేసింది. ఈ తుపాను ప్రభావంతో తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ మురసు తుపాను(Murasu Cyclone) వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఏపీ తీరానికి అతి దగ్గరలోకి చేరుకోబోతోందని వాతావరణ శాఖ తెలిపింది . తుపాను తీవ్రత మెల్లగా పెరుగుతుండటంతో సముద్రంలో అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.

గంటకు 50 నుంచి 60 కి.మీ.కు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరాలకు చేరుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన నిబంధనలను జారీ చేశారు.

Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?

Related Articles

Back to top button