Just EntertainmentLatest News

RC17 Movie : చిరు క్లాప్‌తో లాంఛనంగా పట్టాలెక్కిన #RC17..చెర్రీ,సుక్కూ కాంబోపై పెరిగిన బజ్..

RC17 Movie : రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రాబోతున్న మూవీ #RC17 నవంబర్ 1న హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లాంచ్‌ చేశారు.

RC17 Movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ మైండ్ సుకుమార్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ #RC17 అఫీషియల్‌గా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా మూవీపై ఫుల్ బజ్ పెరిగిపోయింది.

మాస్, ఎమోషన్, రా మేకింగ్‌ను కలిపి సిల్వర్ స్క్నీన్‌పై మాయచేయడంలో లెక్కల మాస్టర్ సుకుమార్‌ది ప్రత్యేక శైలి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్‌కు సుక్కు విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఎలా తిరగబడతాయో ఇప్పటికే రంగస్థలం మూవీ రుజువు చేసింది.

సమంత కథానాయికగా, జగపతిబాబు విలన్‌గా నటించిన ఆ మూవీ అప్పట్లో వసూళ్ల సునామీని సృష్టించి టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఆ ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ అయిన చెర్రీ, సుక్కు కాంబో ఇప్పుడు మళ్లీ ఒక్కటి కావడంతో సినీ ప్రియుల్లో, మెగాభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.

తాజాగా ఈ పాన్-ఇండియా మూవీ (#RC17) నవంబర్ 1న అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో నిర్మించడానికి ఇప్పటికే అన్నీ సిద్ధం చేశాయి.

ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి క్లాప్ కొట్టడంతో ప్రాజెక్ట్‌కు మరింత ఊపు వచ్చినట్లు అయింది. చిరుతో పాటు ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు హాజరై మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మూవీలో చెర్రీ వెయిట్ తగ్గి, పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్‌గా, సేమ్ టైమ్‌లో రఫ్ లుక్‌లోనూ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చాలా వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసి, కొత్త ఏడాది జనవరి నుంచి రామ్ చరణ్ డైరెక్టుగా సెట్స్‌లోకి అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌తో పాటు ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేయబోతోంది. కాగా రంగస్థలం మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ రామ్ చరణ్ (#RC17)మూవీ(RC17 Movie) ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో అని టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తోంది.

Jailer 2 : ఈనెలలోనే ఓటీటీలోకి జైలర్ 2 ..30 నిమిషాల ఎక్స్‌ట్రా సీన్స్‌తో రిలీజ్

Related Articles

Back to top button