Just Andhra PradeshJust PoliticalLatest News

CM Chandrababu:మెగా బర్త్ డే సర్ప్రైజ్.. భార్య భువనేశ్వరిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్

CM Chandrababu : పొలిటికల్ రణక్షేత్రంలో ఎన్నో సెన్సేషనల్‌కు, మరెన్నో చారిత్రాత్మక విక్టరీలకు చిరునామాగా నిలిచిన రాజకీయ అపర చాణక్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈరోజుతో 76 వ వసంతంలోకి అడుగుపెట్టారు

CM Chandrababu

పొలిటికల్ రణక్షేత్రంలో ఎన్నో సెన్సేషనల్‌కు, మరెన్నో చారిత్రాత్మక విక్టరీలకు చిరునామాగా నిలిచిన రాజకీయ అపర చాణక్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)ఈరోజుతో 76 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో పొలిటికల్ తుపానులను ఎదుర్కొని, పడి లేచిన కెరటంలా దూసుకుపోతున్న ఈ ప్రజా నాయకుడికి ఈరోజు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా తన పుట్టినరోజు వేళ, అధికారం కంటే పేదలందరి ఆకలి తీర్చడమే పరమావధిగా ఆయన చేసిన కార్యక్రమాలు, తన విజయాల వెనుకున్న అసలు శక్తిని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తన ఎక్స్ వేదికగా పంచుకున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన భార్య, జీవితంలో సగభాగం అయిన నారా భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఆత్మీయ ఫోటోను షేర్ చేస్తూ, చంద్రబాబు హార్ట్‌ఫుల్‌గా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.

రాజకీయాల్లో తాను ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా, పర్సనల్ లైఫ్‌లో తనను నిత్యం నడిపిస్తున్నది తన భార్య ఆప్యాయతేనని చంద్రబాబు ఓపెన్‌గా చెప్పారు. జీవితంలో ఏడడుగులు నడిచిన నాటి నుంచి ఇప్పటి వరకు, ప్రతి మలుపులోనూ భువనేశ్వరి తన వెంటే ఉండి ప్రోత్సహించినట్లు, ఆమె తోడు వల్లే తన జర్నీ ఇంత అర్థవంతంగా మారినట్లు చెబుతూ చంద్రబాబు తన కృతజ్ఞతను తెలిపారు. నిజానికి ప్రతీ ఒక్క విజేత వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాటకు.. మెగా పొలిటికల్ కపుల్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

CM Chandrababu
CM Chandrababu

పుట్టినరోజు వేళ ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, విజయవాడ నగరంలో గల పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు దంపతులు, అక్కడి పేదలతో కలిసి భోజనం చేయడం ఒక అపురూప ఘట్టంగా నిలిచింది. ప్రజాసేవకే తన జీవితం అంకితమని చాటుతూ, స్వయంగా తన చేతులతో పేదలకు వడ్డించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

తన భర్త పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం.. ఏపీ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. చంద్రబాబు 76వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా, ఏపీలోని మొత్తం 269 అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణ ఖర్చు రూ.76 లక్షలను భువనేశ్వరి స్వయంగా విరాళంగా ఇచ్చారు.

ఈ వితరణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి ఈరోజు మూడు పూటలా ఫ్రీగా ఆహారం అందుతోంది.దీంతో చంద్రబాబు లాంటి ఒక గొప్ప నాయకుడికి ఆయన భార్య ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఇదేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Chiranjeevi:మరోసారి మానవత్వాన్ని చాటుకున్న చిరంజీవి..ఆ ఇద్దరినీ ఆదుకున్న మెగాస్టార్

Related Articles

Back to top button