Just Andhra PradeshJust TelanganaLatest News

Highway:తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ కనెక్టివిటీ.. ఖమ్మం-దేవరపల్లి హైవే రెడీ

Highway: ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ , విశాఖపట్నం మధ్య ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభించబోతోంది.

Highway

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత సులువుగా చేస్తూ, రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే(Highway) పనులు సుమారుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ మార్గంలో ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది. ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ , విశాఖపట్నం మధ్య ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభించబోతోంది.

దాదాపు 4,451 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో, 162 కిలోమీటర్ల పొడవునా ఈ నాలుగు వరుసల రోడ్డును నిర్మించారు. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కేవలం రెండేళ్లలోనే చివర దశకు చేరుకోవడంతో ఏపీ, తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పొలాల మధ్య, ఎక్కడా ట్రాఫిక్ లేకుండా సాఫీగా సాగే ఈ రోడ్డుపై కార్లు అయితే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, భారీ వాహనాలయితే 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఈ కొత్త రూట్ వల్ల విజయవాడ మార్గంలో ప్రయాణం చేసేవారికి దాదాపు ఒక గంట, జంగారెడ్డిగూడెం మీదుగా వచ్చేవారికి గంటన్నర పాటు సమయం సేవ్ అవుతుంది. పాత సత్తుపల్లి వంటి రద్దీ ప్రాంతాలను టచ్ చేయకుండా ఈ బైపాస్ నిర్మించడం వల్ల.. డ్రైవర్లకు అలసట తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది.

ప్రస్తుతం దేవరపల్లి నుంచి తెలంగాణలోని వైరా వరకు రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కోసం టోల్ గేట్ల వద్ద అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దేవరపల్లి వద్ద రెండు వైపులా 8 వరుసలతో టోల్ ప్లాజాను నిర్మిస్తున్నారు. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లిపోవచ్చు.

ఇది యాక్సెస్ కంట్రోల్డ్ హైవే(Highway) అవడం వల్ల, వాహనదారులు ఎంత దూరం ప్రయాణం చేశారో దానికి తగ్గట్టు మాత్రమే టోల్ ఫీజులు వసూలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ పరిధిలో దేవరపల్లి, పొంగుటూరు, పొట్లకట్టగూడెం, రేచర్ల వంటి నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే వెహికల్స్‌ను ఈ రోడ్డు పైకి ఎక్కడానికి , దిగడానికి అవకాశం కల్పిస్తున్నారు.

Highway
Highway

వైరా నుంచి ఖమ్మం వరకు మిగిలి ఉన్న చిన్న చిన్న పనులు ఈ ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి కానున్నాయి. ప్రస్తుతం భారీ వాహనాలు, కార్లు ఈ మార్గంలో ట్రయల్ రన్‌గా వెళ్తుండడంతో.. ప్రయాణికులంతా తమ అనుభవం అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

మే నెలాఖరుకి ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేని అధికారికంగా ప్రారంభించి.. పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు రెడీ అవుతున్నారు. ఈ రహదారి కేవలం జర్నీ సమయాన్ని తగ్గించడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక , లాజిస్టిక్స్ అభివృద్ధికి ప్రధాన వారధిగా నిలవబోతుందని అధికారులు చెబుతున్నారు.

Mango: మీరు మామిడి పండ్ల ప్రియులా? అయితే మ్యాంగోను తినడానికి కూడా ఓ లెక్క ఉందని తెలుసుకోండి..

Related Articles

Back to top button