Just Andhra PradeshLatest News

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..ఎప్పుడు? ఎన్నిరోజులు జరుగుతాయి?

Godavari Pushkaralu: వేద పండితులు సూచించిన తేదీల ప్రకారం, గోదావరి పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి

Godavari Pushkaralu

మన భారతదేశంలో పవిత్ర నదీ పుష్కరాల(Godavari Pushkaralu)కు ఎంతో విశిష్టత ఉంది. దేశంలోని ముఖ్యమైన నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చే పుష్కరాలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహిస్తారు. అలాగే త్వరలో రానున్న గోదావరి పుష్కరాలు తేదీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో 2015 జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు(Godavari Pushkaralu) జరిగాయి. ఆ తర్వాతి పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి అనే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగమ, వైదిక పండితులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన వైదిక పండితులు, టీటీడీ ఆస్థాన సిద్ధాంతితో సహా మొత్తం 16 మంది పాల్గొన్నారు.

పండితులు, సిద్ధాంతులు ఈ తేదీలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని వారు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు తేదీలపై అంతా ఒకే నిర్ణయానికి వచ్చారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Godavari Pushkaralu
Godavari Pushkaralu

వేద పండితులు సూచించిన తేదీల ప్రకారం, గోదావరి పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.

మరోవైపు, రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన రానున్న గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu)పై ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2027లో జరిగే పుష్కరాలకు దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారీ సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా గోదావరి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్లలో వసతులు, ఇతర ఏర్పాట్లు కల్పించాలని, దీని కోసం ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాలని అధికారులు సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button