Just BusinessJust NationalLatest News

Gold Rate : మళ్లీ తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ ..10 నెలల్లో బంగారం రూ.71 వేలు, వెండి రూ.2.7 లక్షలు డౌన్

Gold Rate : అంతర్జాతీయ మార్కెట్లలో భారీ పతనం ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం, వెండి రేట్లు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాల్లో నవంబర్ 21 వ తేదీ రోజు పసిడి, వెండి ధరలు ఇక్కడ చూడండి.

Gold Rate

దేశీయ బులియన్ మార్కెట్‌లో ఊహించని రీతిలో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నిన్న అంటే నవంబర్ 20 వ తేదీ ఒక్క రోజే కొద్ది గంటల వ్యవధిలోనే బంగారం, వెండి రేట్లలో చాలా క్షీణత నమోదైంది. బంగారం ధర రూ.1.25 లక్షల దిగువకు చేరగా, వెండి ధర రూ.1.55 లక్షల కంటే కిందకు దిగొచ్చింది.

ఈ ఏడాది జనవరి లాస్ట్ వీక్‌లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను తాకిన ఈ రేట్లు.. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. జనవరి 29న కమోడిటీ మార్కెట్‌లో గోల్డ్ రేట్(Gold Rate) రూ.1.93 లక్షలకు, వెండి రూ.4.20 లక్షలకు చేరి రికార్డ్ క్రయేట్ చేశాయి. నాటి గరిష్ట ధరలతో పోలిస్తే గడిచిన 10 నెలల్లోనే తులం బంగారం రేటు రూ.71,000 వరకూ తగ్గగా, కిలో వెండి రేటు ఏకంగా రూ.2.70 లక్షలకు పైగా క్షీణించింది.

ఐబీజేఏ (IBJA) లెక్కల ప్రకారం అక్టోబర్ 19వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1లక్ష46వేల406గా ఉండగా, నవంబర్ 21 నాటికి అది రూ.1 లక్ష23 వేల584కు చేరింది. అంటే కేవలం ఒకే నెల వ్యవధిలోనే గోల్డ్‌పై సుమారు రూ.23,000 వరకూ తగ్గింది.

ఇక సిల్వర్ విషయంలో ఎంసీఎక్స్‌ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన కేజీ సిల్వర్ ధర ఒకే రోజు రూ.5,356 తగ్గి రూ.1.52 లక్షల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు రూ.4.20 లక్షలుగా ఉన్న వెండి ధర ఇప్పుడు 5 శాతం వరకూ తగ్గి రూ.1.50 లక్షల దిగువకు పడిపోవడంతో 10 నెలలలోనే వెండి తన విలువలో సగానికి పైగా కోల్పోయినట్లయింది.

ప్రస్తుతం నవంబర్ 21వ తేదీన వివిధ నగరాలలో పసిడి ధరలను(Gold Rate) పరిశీలిస్తే.. హైదరాబాద్, ముంబై , విశాఖ పట్నం, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1లక్ష25వేల560గా ఉంటే, ఆర్నమెంట్ 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1లక్ష15వేల 90 వద్ద నమోదైంది. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1 లక్ష25వేల710 వద్ద, 22 క్యారెట్ల పసిడి రూ.1లక్ష15వేల240 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

దేశీయంగా బంగారం, వెండి ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమనే విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ప్రపంచ మార్కెట్లో నవంబర్ 20 వ తేదీ శుక్రవారం కామెక్స్ ఎక్స్ఛేంజ్‌లో బంగారం రేటు 4.54 శాతం వరకూ పడిపోయి ఔన్సు గోల్డ్ $3,518 వద్దకు చేరింది. అదేవిధంగా సిల్వర్ కూడా 7 శాతానికి పైగా పడిపోయి ఔన్సుకు $41.220 వద్ద ట్రేడ్ అవుతుండటంతో లోకల్ మార్కెట్లలోనూ ఆ ఎఫెక్ట్ క్లియర్‌గా కనిపిస్తోంది.

Blood Relation : రక్త సంబంధీకులు దూరమవుతున్నారు..బయటివాళ్లే మనవాళ్లలా మారుతున్నారు..

Related Articles

Back to top button