Just CrimeJust NationalLatest News

SIM Cards : అందుబాటులోకి డీఐపీ సిస్టమ్..కొత్త రూల్స్‌తో సైబర్ నేరాలకు ఎంత వరకూ చెక్ పడొచ్చు..

SIM Cards : ఆగస్టు 17వ తేదన టెలికాం ఆపరేటర్లకు క్లియర్‌గా సర్క్యులర్ జారీ చేసిన కేంద్రం, ఆగస్టు 23వ తేదీ నుంచి ఈ డీఐపీ సిస్టమ్ పనిచేస్తుందని స్పష్టం చేసింది.

SIM Cards

డిజిటల్ విప్లవంతో ఓ వైపు పనులన్నీ ఈజీగా అయిపోతూ ఉంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు మాత్రం దానితోనే అమాయకుల అకౌంట్లను ఖాళీ చేసేస్తూ కోట్లు దోచేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ దొంగల ముఠాను, ఫ్రాడ్‌స్టర్స్‌ని ఏరిపారేయడానికి కేంద్ర టెలికాం శాఖ (DoT)తీసుకున్న శక్తివంతమైన నిర్ణయం హాట్ టాపిక్ అయింది.

భారత దేశంలో నకిలీ ఐడీలతో, పరిమితికి మించి సిమ్ కార్డులు(SIM Cards) తీసుకుని నేరాలు చేస్తున్నవారికి శాశ్వతంగా చెక్ పెట్టడానికి రూల్స్‌ను చాలా స్ట్రిక్ట్ చేసింది. ఒక్క వ్యక్తికి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలనే పాత కండీషన్‌ను ఇకపై కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఆ లిమిట్ దాటితే కొత్త సిమ్ కట్ అవ్వడమే కాకుండా ఉన్న పాత సిమ్‌లు కూడా బ్లాక్ అయిపోయేలా ఒక హైటెక్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది.

ఈ కొత్త నెట్‌వర్క్ ఫిల్టరింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DIP) అనే పవర్‌ఫుల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్టు 17వ తేదన టెలికాం ఆపరేటర్లకు క్లియర్‌గా సర్క్యులర్ జారీ చేసిన కేంద్రం, ఆగస్టు 23వ తేదీ నుంచి ఈ డీఐపీ సిస్టమ్ పనిచేస్తుందని స్పష్టం చేసింది.

దీని ప్రకారం ఇకపై ఏ టెలికాం కంపెనీ అయినా సరే ఒక కస్టమర్‌కి కొత్త సిమ్ కార్డు జారీ చేయడానికి ముందు వారి ఫోటోను, ఐడీ వివరాలను ఈ డీఐపీ డేటాతో కచ్చితంగా క్రాస్ చెక్ చేయాల్సిందే. ఒకవేళ ఆ వ్యక్తి పేరుతో ఇప్పటికే 9 సిమ్‌లు ఉంటే కనుక, సదరు వ్యక్తి ఫోటో ఈ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ అవ్వడమే కాకుండా కొత్త సిమ్ రిజెక్ట్ అయిపోతుంది.

ఆగస్టు 24 వ తేదీ నుంచి టెలికాం కంపెనీలన్నీ కూడా ఈ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నవంబర్ 30 వ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా సెకన్లలో రియల్ టైమ్‌లో పనిచేసేలా సెట్ చేయాలని డీఓటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

అంతేకాదు, తమ వద్ద 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్న వినియోగదారులు వాటిని వెంటనే స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. లేని పక్షంలో టెలికాం కంపెనీలే డైరెక్టుగా ఆ ఎక్స్‌ట్రా సిమ్‌లను డిస్‌కనెక్ట్ చేసేస్తాయి.

దీనికి తోడు మీ పేరు మీద అసలు ఎన్ని సిమ్‌లు రన్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే సంచార్ సాథీ అనే అఫీషియల్ పోర్టల్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దాని ద్వారా మీ ఆధార్‌తో లింకైన ఎక్స్‌ట్రా సిమ్‌లను ఈజీగా గుర్తించి రిపోర్ట్ చేయొచ్చు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకీ నిర్ణయం తీసుకుంది? ఈ నిర్ణయం వల్ల సైబర్ నేరాలు నిజంగానే ఆగుతాయా అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి. అసలు ఇది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నూటికి నూరు శాతం వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంటున్నారు.

SIM Cards
SIM Cards

సైబర్ క్రైమ్స్ చేసే గ్యాంగ్‌లు అమాయకుల నుంచి లేదా డూప్లికేట్ ఐడెంటిటీ కార్డుల నుంచి వందల సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుని నేరాలు చేస్తున్నారు. ఇప్పుడు 9 సిమ్‌ల లిమిట్‌ ఉండటంతో పాటు ఫేస్ అండ్ డేటా మ్యాచింగ్ ఉండటం వల్ల ఫేక్ సిమ్‌లు లీకేజ్ కావడం ఇంపాజిబుల్ అవుతుంది.

టెలికాం కంపెనీలన్నీ ఒకే సెంట్రలైజ్‌డ్ డీఐపీ డేటాబేస్‌ను వాడుతూ ఉండటం వల్ల ఏ కంపెనీలో ఎన్ని సిమ్‌లు(SIM Cards) ఉన్నాయో టెలికాం శాఖకు క్షణాల్లో తేలిపోతుంది. కాబట్టి ఇది హండ్రెడ్‌కు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమయ్యే ప్లాన్. దీనివల్ల నకిలీ కాల్స్, ఓటీపీ మోసాలు, మనీ డ్రాగింగ్ నెట్‌వర్క్‌లకు చెక్ పడి.. యూజర్లకు డిజిటల్ సేఫ్టీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Jetal Zala: Jetal Zala s Ecobalance Brings Data-Driven Climate Innovation to UK Hospitality

Related Articles

Back to top button