Just EntertainmentLatest News

Allu Arjun : ఇకపై 6 నెలలకోసారి బన్నీ ఫ్యాన్ మీట్..ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ

Allu Arjun : మిగిలిన హీరోలతో పోలిస్తే అల్లు అర్జున్ అభిమానులతో గడిపే సందర్భాలు కొంచెం తక్కువే. ఇకపై దీనికి చెక్ పెట్టాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మిగిలిన హీరోలతో పోలిస్తే అల్లు అర్జున్ అభిమానులతో గడిపే సందర్భాలు కొంచెం తక్కువే. ఇకపై దీనికి చెక్ పెట్టాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.

అందుకే రానున్న రోజుల్లో ఆరు నెలలకోసారి ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. తాజాగా తన అభిమానులతో బన్నీ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ఏదో ఫోటోలు దిగేసి, ఆటోగ్రాఫ్ ఇచ్చేసి పంపించడం కాకుండా దాదాపు ఆరు గంటల పాటు వారితో గడిపాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ట్రోలర్స్ గురించి పట్టించుకోవద్దని అభిమానులకు సూచించాడు. మిమ్మల్ని ద్వేషించే వారిపై అనవసరంగా సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్నాడు. ఆ సమయాన్ని మీ ఆత్మీయులతో గడపాలని పిలుపునిచ్చాడు.

రాకా షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా ఈ ఫ్యాన్ మీట్‌లో బన్నీ పాల్గొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా 900 మందికి పైగా అభిమానులతో ఎంతో ఓపిగ్గా గడపడం కూడా హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా వారితో మమేకమవడంతో పాటు అభిమానుల భద్రత కోసం భీమా పాలసీలు సైతం అందించాడు.

కాగా ఇకపై ఇలా అభిమానులతో తరచుగా భేటీ కావాలని బన్నీ నిర్ణయించుకోవడం.. బన్నీ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ను నింపుతుంది. సాధారణంగా తమిళ హీరోలు ఇలాంటి ఫ్యాన్ మీటింగ్స్ ఎక్కువగా నిర్వహిస్తుంటారు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడన్న వార్తల మధ్య ఇలాంటి భేటీలు చాలా జరిగాయి. అలాగే నటుడు విజయ్ కూడా తన రాజకీయ అరంగేట్రానికి ముందు ఇలానే అభిమాన సంఘాలతో తరచుగా భేటీ అయ్యాడు.

Allu Arjun
Allu Arjun

ఇప్పుడు బన్నీ కూడా అభిమానులతో ఆరు నెలలకోసారి కలవాలని నిర్ణయించుకోవడంతో భవిష్యత్తులో అల్లు అర్జున్ పొలిటికల్ కెరీర్‌కు ఏదైనా పునాది కానుందా అన్న చర్చ మొదలైంది. అయితే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చినా..వాటిని బన్నీ టీమ్ అధికారికంగా వాటిని ఖండించింది.

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమనీ, ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని పేర్కొంది. కానీ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాడన్న విషయాన్ని మాత్రం బన్నీ టీమ్ చెప్పలేదు. దీంతో ప్రస్తుతం అభిమానులతో బన్నీ మీటింగ్స్ కారణంగా.. ఫ్యూచర్‌లో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చేమో అన్న అనుమానాలు కూడా నెలకొంటున్నాయి.

IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. పరారీ నుంచి కస్టడీ వరకూ వరుస వివాదాలతో బిగుస్తున్న ఉచ్చు

Related Articles

Back to top button