Bigg BossJust Entertainment

Bigg Boss Nomination : డేంజర్ జోన్‌లో ఆ 8 మంది కంటెస్టెంట్స్.. బిగ్ బాస్‌లో ఈ వీక్ బిగ్ ఫైట్ పక్కా..

Bigg Boss Nomination : బిగ్ బాస్ హౌస్‌లో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని పరిణామాలు. త్రిగుణ్, వర్షిణి ఎమోషనల్ డిస్కషన్, నామినేషన్స్ హీట్, ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వివరాలు ఇక్కడ చూడండి.

Bigg Boss Nomination

బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషన్స్, ఊహించని ట్విస్టులు, కంటెస్టెంట్‌ల స్ట్రాటజీలు అన్న సంగతి తెలిసింది. మంగళవారం ఎపిసోడ్‌లో గ్రీన్ జోన్‌లో ఉన్న గోట్స్ ఇచ్చిన నామినేషన్స్‌(Bigg Boss Nomination)తో బిగ్ బాస్ హౌస్‌లో వాతావరణం మరోసారి వేడెక్కింది. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేయడమే పెద్ద షాక్ అంటే.. దీనికి రివర్స్‌లో వర్షిణి కూడా త్రిగుణ్‌ను టార్గెట్ చేయడం హౌస్‌లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

దీంతో తన ప్రాణ స్నేహితురాలు తనను అర్థం చేసుకోలేదని, తనకు సపోర్ట్ చేయలేదని ఫీల్ అవుతూ త్రిగున్ కంటతడి పెట్టడం అందరినీ ఆలోచనలో పడేసింది. త్రిగుణ్ ఎమోషనల్ అవుతుంటే రోహిత్ సైడ్‌లో నవ్వుకోవడం, ముకేష్ మాత్రం తనకు చికెన్ ముఖ్యమని, డిస్కషన్స్ వద్దని అక్కడి నుంచి వెళ్లిపోవడం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు నరేశ్, రామ్ ప్రసాద్ తమదైన స్టైల్‌లో కామెడీ స్కిట్స్‌ చేస్తూ హౌస్ మేట్స్‌ని ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు.

ఇక అసలు సిసలైన నామినేషన్ల విషయానికి వస్తే.. ఎల్లో లెవల్‌లో ఉన్నవారిలో ముగ్గురికి మాత్రమే నామినేట్ చేసే అవకాశాన్ని ఇవ్వగా, గ్రీన్ జడ్జీలు వాటిని ఫైనల్ చేశారు. నరేష్ ఇచ్చిన నామినేషన్‌తో వర్షిణి డేంజర్ జోన్‌లోకి వెళ్లడంతో.. ఆమె తన సర్జరీ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయింది. శివ్, సుధీర్, రామ్ ప్రసాద్‌ మధ్య జరిగిన నామినేషన్ల వార్‌లో ముకేష్ జోక్యం చేసుకోవడంతో ఎప్పటిలాగే కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఇక రెడ్ టీమ్ నుంచి రోహిత్,ఝాన్సీ, రామకృష్ణ, శ్వేత ఎంట్రీ ఇచ్చి ఒకరిపై ఒకరు నామినేషన్ అస్త్రాలను సంధించుకున్నారు.

చివరకు ఈ రెండు రోజుల పాటు సాగిన హై-వోల్టేజ్ నామినేషన్ల(Bigg Boss Nomination) ప్రాసెస్‌లో ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ్ నామినేషన్లలో నిలిచారు. సేఫ్‌గా ఉన్న శ్వేత, నరేశ్, వంశీలో ఒకరిని నామినేట్ చేసే పవర్‌ను బిగ్ బాస్ గ్రీన్ గోట్స్‌కు బిగ్ బాస్ ఇవ్వగా, వారు వంశీ పేరును లాక్ చేశారు. మొత్తంగా ఈ వీక్ 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ రేసులో నిలవడంతో, వీళ్లలో ఎవరు బయటకు వెళ్తారు.. ఒకరే వెళతారా లేక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు లెక్క తేలేలా ఇద్దరిని బయటకు వెళతారా అనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో పెరిగిపోయింది.

Nail Changes : చేతి గోళ్లపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. కాల్షియం లోపం అనుకుని లైట్ తీసుకోకండి..

Related Articles

Back to top button