Dark Comedy : మలయాళం సంచలన డార్క్ కామెడీ..ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?
Dark Comedy : కరోనా తర్వాత థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తే వారి సంఖ్య బాగా తగ్గింది. టాలీవుడ్ మూవీస్ కు ఆదరణ బాగానే ఉన్నా ఇతర భాషా చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకోవడం కష్టంగానే కనిపిస్తోంది
Dark Comedy
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తే వారి సంఖ్య బాగా తగ్గింది. టాలీవుడ్ మూవీస్ కు ఆదరణ బాగానే ఉన్నా ఇతర భాషా చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను ఓటీటీ వేదికలుగానే విడుదల చేస్తున్నారు.
వీటికి ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తోంది. తాజాగా మళయాళంలో సూపర్ హిట్ అయిన డార్క్ కామెడీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘భరతనాట్యం-2 మోహినియాట్టం ’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యువ నటుడు సాయిజు కురుప్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆసక్తికరమైన ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మే 8 నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంటుంది.
ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఊహించని సమస్యలు, వాటి నుండి బయటపడటానికి వారు చేసే ప్రయత్నాలను దర్శకుడు కృష్ణదాస్ మురళి ఎంతో వినోదభరితంగా తెరకెక్కించారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ డార్క్ కామెడీని బాగానే ఆస్వాదించారు. అందుకే మూవీ విడుదలైన 10 రోజుల్లోనే రూ. 21.5 కోట్లు వసూలు చేసింది.

ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన రహస్యాల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. కుటుంబం ప్రతిష్టను కాపాడటానికి కథానాయకుడు పడే పాట్లు, ఆ క్రమంలో చోటుచేసుకునే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సాయిజు కురుప్ తన సహజసిద్ధమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైన చిత్రానికి కొనసాగింపుగా ఒక చిత్రాన్ని తీయడం చాలా సాహసోపేతమైన విషయంగానే చెప్పాలి.
రచయితగా కృష్ణదాస్ మురళి ప్రతిభకు, ఆత్మవిశ్వాసానికి ఈ మూవీ చక్కని ఉదాహరణ. ఫ్యామిలీ కామెడీ డ్రామాకు ఒక కొత్త మలుపు ఇచ్చి, ఆశ్చర్యపరిచే డార్క్ హ్యూమర్‌తో తెరకెక్కింది. దీంతో ఇది ప్రేక్షకులను దాదాపు సినిమా అంతా నవ్వులతో ముంచెత్తింది.
Fish : చేపలు అందరికీ అమృతమేనా? మరి ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తినొచ్చా?





