HealthLatest News

Fish : చేపలు అందరికీ అమృతమేనా? మరి ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తినొచ్చా?

Fish : చేపలు పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ఆరోగ్యం. కంటికి మంచిదని, గుండెకు బలమని డాక్టర్లు కూడా చేపలను తినమనే చెబుతుంటారు

Fish

చేపలు పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ఆరోగ్యం. కంటికి మంచిదని, గుండెకు బలమని డాక్టర్లు కూడా చేపలను తినమనే చెబుతుంటారు. కానీ ఫిష్(Fish) అంటే ఇష్టపడే వారందరికీ చేపలు మంచివి కావు. మన బాడీ తత్వం, మనం వాడే మందులు, మన వయసును బట్టి చేపలు మనకు మంచి చేస్తాయా లేక హాని చేస్తాయా అనేది ఆధారపడి ఉంటుంది. అసలు ఎవరెవరు చేపలకు దూరంగా ఉండాలో తెలుసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.

గర్భిణీలు చేపలు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడతాయి. అయితే సముద్రంలో దొరికే పెద్ద చేపలైన సొరచేపలు లేదా కింగ్ మాకెరల్ వంటి వాటిని అసలు తినకూడదు.

ఎందుకంటే ఇవి ఇతర చిన్న చేపలను తిని పెరగడం వల్ల వీటి శరీరంలో మెర్క్యురీ అంటే పాదరసం ఎక్కువగా పేరుకుపోతుంది. గర్భిణీలు ఈ చేపలు తింటే ఆ పాదరసం కడుపులోని బిడ్డ మెదడుపై, నాడీ వ్యవస్థపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఫ్యూచర్‌లో పిల్లల ఎదుగుదల కుంటుపడటానికి కారణమవుతుంది. అలాగే చిన్న పిల్లలకు సముద్రపు చేపల కంటే మన చెరువుల్లో, వాగుల్లో పెరిగే తాజా చేపలను పెట్టడమే మంచిది.

చేపలు(Fish) తిన్న వెంటనే కొందరికి దద్దుర్లు రావడం, దురద పెట్టడం వంటివి జరుగుతుంటాయి. చాలామంది దీన్ని మామూలు అలర్జీ అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ దీనివల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. తిన్న వెంటనే ఊపిరి ఆడకపోయినట్లు అన్పించినా, నాలుక వాపు వచ్చినట్లు అనిపించినా అది ప్రమాదకరమైన అలర్జీ అని జాగ్రత్త పడాలి. ఇలాంటి వారు ఫిష్ తినకుండా ఉండటమే మంచిది.

అలాగే గుండె జబ్బుల కోసం రక్తాన్ని పలుచబరిచే మెడిసిన్ వాడేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. చేపలు సహజంగానే రక్తాన్ని ఇంకా పలుచగా చేస్తాయి. మెడిసిన్, చేపలు రెండూ కలిస్తే రక్తం మరీ పలుచబడి, చిన్న దెబ్బ తగిలినా రక్తం ఆగకుండా కారిపోయే ప్రమాదం ఉంటుంది.

Fish
Fish

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు , యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఫిష్‌ను అస్సలు తినకూడదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సరిగ్గా వండని పచ్చి చేపల వంటకాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. కానీ సరిగ్గా ఉడికించని చేపల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.

ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు ఇవి తింటే తీవ్రమైన వాంతులు, విరేచనాల బారిన పడతారు. అందుకే చేపలను ఎప్పుడూ శుభ్రంగా కడిగి, బాగా ఉడికించిన తర్వాతే తినడం మన ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలుసుకోవాలి.

Chennai Super Kings : చెపాక్ లో చెన్నై చెడుగుడు..చిత్తుగా ఓడిన ముంబై

Related Articles

Back to top button