Irumudi : ఇరుముడి మూవీకి లీగల్ చిక్కులు.. కార్మిక శాఖ నుంచి ఊహించని నోటీసులు
Irumudi : మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసిన ఇరుముడి మూవీకి లీగల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. బాలకార్మిక నిబంధనలను ఉల్లంఘించారంటూపై తెలంగాణ కార్మిక శాఖ మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపింది.
Irumudi
మాస్ మహారాజా రవితేజ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ఇరుముడి(Irumudi) మూవీ బాక్సాఫీస్ వద్ద మాస్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్‌లో కూడా ఓటీటీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. థియేటర్లలో అప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. అయితే ఈ విజయంతో జోష్ మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు ఇప్పుడు లీగల్ షాక్ తగిలింది. ఈ మూవీలో నటించిన బాలనటి విషయంలో బాలకార్మిక కండీషన్లను పాటించలేదనే సంచలన ఆరోపణలతో తెలంగాణ కార్మిక శాఖ డైరెక్టుగా నోటీసులు ఇచ్చింది.
జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఈ వివాదం వెనుక మెయిన్ రీజన్‌గా మారింది. ఈ మూవీ(Irumudi)లో రవితేజ కూతురు మణెమ్మ రోల్లో నటించి తన యాక్షన్‌తో ప్రశంసలు అందుకున్న బేబీ నక్షత్ర సెలక్షన్ సమయంలో మూవీ యూనిట్ చట్టపరమైన రూల్స్‌ను పక్కనపెట్టిందని ఆరోపిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా చిన్న పిల్లలను మూవీలలో తీసుకునేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏమీ పాటించలేదన్న వార్తలతో తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ రంగంలోకి దిగి సీరియస్ ప్రశ్నలతో నోటీస్ పంపారు.
కార్మిక శాఖ పంపిన నోటీసుల్లో ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌ను కొన్ని పక్కా ఆధారాలతో వివరణ ఇవ్వాలని కోరింది. చిన్నారితో షూటింగ్ చేసే ముందు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు పర్మిషన్స్ తీసుకున్నారా లేదా? పేరెంట్స్ అంగీకార పత్రం ఉందా? అలాగే చట్టం ప్రకారం నక్షత్రకు ఇచ్చిన రెమ్యునరేషన్లో 20 శాతాన్ని తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? అని అడిగారు. వీటితో పాటు షూటింగ్ నైట్ టైమ్‌లో ఎంతసేపు చేశారు, పాప చదువుకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ అంశాలపై పూర్తి రిపోర్ట్‌తో నవంబర్ 4వ తారీఖు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌కు డైరెక్టుగా గానీ, లేక లీగల్ ప్రతినిధి ద్వారా అయినా విచారణకు హాజరుకావాలని నోటీసులు అందాయి. ప్రస్తుతం ఓటీటీలో ఇప్పటికీ టాప్ లేపుతున్న ఇరుముడి మూవీకి ఈ విచారణ ఎలాంటి మలుపులు తిప్పుతుందోనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




