Just EntertainmentLatest News

Kaaka : మెగా158 నుంచి కాకా క్రేజీ సర్ప్రైజ్..3 నిమిషాల గ్లింప్స్‌తో మైండ్ బ్లాక్..

Kaaka : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మేకర్స్ చిరు బర్త్‌డే గిఫ్ట్‌గా టైటిల్ ప్రకటించడమే కాకుండా, మూవీ రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేసి ఫ్యాన్స్‌లో డబుల్ జోష్‌ను నింపారు.

Kaaka

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మేకర్స్ చిరు బర్త్‌డే గిఫ్ట్‌గా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేశారు . చాలా రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా 158 (Mega 158) మూవ నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. శనివారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయడంతో.. సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూలను సొంతం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది.

ఇక ఇప్పటి వరకూ ప్రచారం జరిగినట్లే మెగాస్టార్ మూవీకి కాకా(Kaaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ ప్రకటించడమే కాకుండా, మూవీ రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేసి ఫ్యాన్స్‌లో డబుల్ జోష్‌ను నింపారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

దాదాపు 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ గ్లింప్స్‌లో చిరంజీవి ప్రజెన్స్, చిరు మోస్ట్ స్టైలిష్ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఈ మూవీకి మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్ వహిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో, బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో ఏ రేంజ్‌లో విధ్వంసం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

మళ్లీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. పక్కా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫుల్ లెంగ్త్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో అలరించబోతోంది.

Kaaka
Kaaka

అంతేకాకుండా ప్రియమణి, బండ్ల గణేష్,సునీల్ వంటి క్రేజీ స్టార్ కాస్ట్ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి పవర్‌ఫుల్ స్వరాలు అందిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సుమారు 50 శాతం చిత్రీకరణ పూర్తవడంతో.. మిగతా భాగం కూడా వేగంగా పూర్తి చేసి, సంక్రాంతి రేసులో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలనే ప్లాన్‌తో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఆయన క్రేజ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయేలా పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ మైండ్ బ్లాకింగ్ యాక్షన్ సీన్స్‌తో బాబీ ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీ కోసం టాలీవుడ్‌లోని టాప్ మోస్ట్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తోంది.

Telangana Congress : సీఎం పీఠం కింద నీళ్లు చేరుతున్నాయా?.. రేవంత్ పవర్స్‌కి ఇంటర్నల్ పాలిటిక్స్ చెక్ పెడుతున్నాయా?

Related Articles

Back to top button