Just EntertainmentLatest News

Peddi Trailer : ఆట మారుతోంది..ఆటగాడు మారట్లే..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పెద్ది ట్రైలర్

Peddi Trailer : రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ట్రైలర్ ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో విడుదలైంది

Peddi Trailer

మెగాఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. దీని కోసం రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. క్రికెట్ , కుస్తీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా పెద్ది సినిమా ట్రైలర్(Peddi Trailer) ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండబోతోందని ట్రైలర్ తోనే అర్థమైంది. స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. నాకిష్టమైన క్రికెటర్ పెద్ది… నాకిష్టమైన రెజ్లర్ పెద్ది.. నాకిష్టమైన రన్నర్ పెద్ది…అంటూ ఇంట్రడక్షన్ డైలాగ్స్ బాగా పేలాయి. ఇక్కడ ఆట మారుతోంది తప్ప ఆటగాడు మారట్లేదు అంటూ బోమన్ ఇరానీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఈ మూవీలో రామ్ చరణ్ గల్లీ క్రికెటర్ గా కనిపిస్తాడు.. కుస్తీ వీరుడిగానూ కనిపిస్తాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టాడని గెటప్స్ వేరియేషన్స్ చూస్తేనే తెలుస్తోంది. కుస్తీ కోసం తన బాడీని బాగా మార్చుకున్నాడు. చెర్రీ పడ్డ కష్టమంతా ట్రైలర్ లో కనిపిస్తోంది. రాంచరణ్‌ యాక్టింగ్ స్టామినాను బుచ్చిబాబు తన దర్శక ప్రతిభతో బాగా హైలైట్ చేసాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

Peddi Trailer
Peddi Trailer

ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్ పలికిన డైలాగ్ ఆట గెలవడం కాదు.. బతకడం కావాలి హైలైట్ గా నిలిచింది. వాళ్లకు ఆటాడటమే తెలుసు. మనకు ఆటాడించడం తెలుసు అని దివ్యేందు శర్మను పరిచయం చేశారు. ఇక జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉందని ట్రైలర్(Peddi Trailer) ద్వారా తెలుస్తోంది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ రొమాన్స్ కూడా అభిమానులను అలరించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రైలర్ ముగింపులో మీరు అందరూ ఆడానని అనుకొంటున్నారు. కానీ నేను పోరాడాను సారూ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. మొత్తం మీద మెగా ఫ్యాన్స్ కు ఈ మూవీ ఫుల్ మీల్స్ అంటూ ట్రైలర్ చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Bullet Train : ముంబై టు హైదరాబాద్ జస్ట్ 3 గంటలే.. ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ

Related Articles

Back to top button