Ramayana Trailer : రామాయణ ట్రైలర్ వచ్చేసింది.. మరి ఆడియన్స్ ఏమంటున్నారు ?
Ramayana Trailer : ట్రైలర్‌లో అన్నింటికంటే పెద్ద హైలైట్ ..రావణాసురుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యశ్ లుక్. భయంకరమైన రావణాసురుడి పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.
Ramayana Trailer
భారతీయ ఇతిహాస కథల్లో అత్యంత గొప్ప కావ్యం రామాయణం..దీనిని వెండితెరపై చాలా మంది ఆవిష్కరించారు. కానీ ప్రతిసారీ రామాయణం మీద సినీ అభిమానుల్లో ఆసక్తి ఉంటూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. నవంబర్ 8, 2026 న దీపావళి కానుకగా మొదటి భాగం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన గంటలోనే ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 4 నిమిషాల 9 సెకన్ల నిడివితో సాగిన ఈ ట్రైలర్ అద్భుతమైన విజువల్ వండర్ అనుభూతి ఇస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు.
రాముడిగా రణబీర్ కపూర్ శాంతమైన లుక్‌తో మెప్పించగా, సీతగా సాయి పల్లవి తనదైన నటనతో డివైన్ లుక్‌లో ఆకట్టుకుంది. ఇక ట్రైలర్‌లో అన్నింటికంటే పెద్ద హైలైట్ రావణాసురుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యశ్ లుక్. భయంకరమైన రావణాసురుడి పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.
గతంలో వచ్చిన ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ వివాదాల వల్ల, ఈసారి టీమ్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డిఎన్ఈజీ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఐమాక్స్ స్క్రీన్ల కోసం చిత్రీకరిస్తున్నారు.

కాగా ట్రైలర్ లో అయోధ్య వైభవం, లంక సామ్రాజ్యం చాలా రిచ్‌గా చూపించారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే లుక్స్ అలాగే జటాయువు సీన్స్ ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నా.. ట్రైలర్‌లో వారి మార్క్ మ్యూజిక్ అంతగా కనిపించలేదని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో కొన్ని మార్పులు చేయడం వల్ల రామాయణ ప్రాముఖ్యత దెబ్బతింటుందేమోనని కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రామాయణ మహా కావ్యం కావడంతో దాని ఆత్మ దెబ్బతినకుండా ఉండటానికి వీలుగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు.
Self Love And Selfishness : సెల్ఫ్ లవ్ , సెల్ఫిష్‌నెస్ మధ్య సన్నని గీత.. మనుషుల్లో పెరుగుతుంది





