RC17 : చరణ్ ,సుకుమార్ మాస్ కాంబో రిపీట్..క్రేజీ లుక్‌తో చెర్రీ
RC17 : రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న #RC17 మూవీ నవంబర్ 1న అధికారిక పూజతో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌పై మరోసారి అందరి చూపు పడింది.
RC17
తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన రంగస్థలం మూవీ తర్వాత.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ (#RC17) అప్‌డేట్ వచ్చేసింది. సినీ వర్గాల్లో,మెగా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్ 1వ తారీఖు ఉదయం 10:50 గంటలకు పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభం కాబోతోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.
ఈ సారి లెక్కల మాస్టార్ సుకుమార్ మార్క్ మేకింగ్‌కు తగ్గట్లు.. రామ్‌చరణ్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రామ్ చరణ్ రోల్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ వెయిట్ తగ్గి, పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్‌గా, సేమ్ టైమ్‌లో రఫ్ లుక్‌లోనూ కనిపించబోతున్నారట.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, కొత్త ఏడాది జనవరి నుంచి రామ్ చరణ్ డైరెక్టుగా సెట్స్‌లోకి అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేయబోతోంది.




