Just EntertainmentLatest News

Sridevi :మద్రాస్ హైకోర్టులో శ్రీదేవి భూమి వివాదం.. బోనీ కపూర్ కుటుంబానికి పూర్తి ఊరట దక్కుతుందా?

Sridevi : 1988వ సంవత్సరంలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న దాదాపు 4.7 ఎకరాల భూమిని శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు.

Sridevi

అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi) మరణించి ఏళ్లు గడిచినా, తన ఆస్తులకు సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఒక ఖరీదైన భూమి వ్యవహారం మద్రాస్ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో శ్రీదేవి(Sridevi) భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. వారికి అనుకూలంగా టెంపరరీగా స్టే విధిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

నిజానికి ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైంది అంటే.. 1988వ సంవత్సరంలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న దాదాపు 4.7 ఎకరాల భూమిని శ్రీదేవి(Sridevi) చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఆ భూమికి అసలైన యజమాని ఎంసీ సంబంధ ముదలియార్ దగ్గర శ్రీదేవి ఆ భూమిని కొనుగోలు చేసినప్పటి నుంచి అది ఆమె పేరుమీదే ఉంది.

అయితే ముదలియార్ వారసులమని చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు..శ్రీదేవి కొన్న ఈ ఆస్తిపై హక్కుల కోసం వివాదం సృష్టించారు. శ్రీదేవి కుదుర్చుకున్న సేల్ డీడ్ అసలైనది కాదంటూ.. అది మోసపూరితమైనదని వాదిస్తూ కోర్టులో దావా వేశారు. ఈ ముగ్గురిలో ముదలియార్ కుమారుడి రెండో భార్య చంద్రబానుతో పాటు ఆమె ఇద్దరు కుమారులున్నారు.

కాగా దీనిపై బోనీ కపూర్ తరపు న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలను వినిపించారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం చూసుకుంటే.. మొదటి భార్య బతికి ఉండగా చేసుకున్నఈ రెండో వివాహం చెల్లదని, అందుకే రెండో భార్యకు లేదా ఆమె పిల్లలకు ఆ ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

Sridevi
Sridevi

బోనీ కపూర్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్.. ఆ ముగ్గురు వ్యక్తులు సృష్టించిన మోసపూరిత పత్రాలను రద్దు చేయాలంటూ ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంపైన తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు సూచించారు. తప్పుడు పత్రాలతో తమను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బోనీ కపూర్ కుటుంబం కోరుతోంది.

శ్రీదేవి చనిపోయేటప్పటికి ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. 2018లో ఆమె మరణం తర్వాత ఆ ఆస్తులన్నీ సహజంగానే జాన్వీ కపూర్, ఖుషి కపూర్లకు వారసత్వంగా దక్కాయి. బోనీ కపూర్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నా సరే, ఎక్కువ భాగం పిల్లల పేరు మీదనే ఉన్నాయి. మిగిలిన ఆస్తులన్నీ కూడా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా ఉన్నా.. చెన్నైలోని ఈ 4.7 ఎకరాల భూమి మాత్రమే కోర్టు చిక్కుల్లో పడిపోయింది. కాగా ఈ కేసులో తుది విచారణ మార్చి 26న జరగనుంది. ప్రస్తుతానికి హైకోర్టు స్టే విధించడంతో బోనీ కపూర్ కుటుంబానికి కాస్త ఊరట లభించినట్టే అనిపిస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button