Environment : రాబోయే విపత్తులను ప్రకృతి ముందే చెప్పేస్తుందా .. నేరేడు, మర్రి, చీమలు చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు..
Environment : ప్రకృతిలో జరిగే భూగర్భ అలజడులను పసిగట్టడమే కాకుండా.. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం చెట్లు, జంతువులు, కీటకాలు రకరకాల సంకేతాల ద్వారా మనందరినీ హెచ్చరిస్తుంటాయి.
Environment
వాతావరణంలో వచ్చే చిన్న మార్పులను మనుషుల కంటే.. మన చుట్టూ ఉండే చెట్లు, జంతువులు, కీటకాలు చాలా ముందే గ్రహిస్తాయి. ప్రకృతిలో జరిగే భూగర్భ అలజడులను పసిగట్టడమే కాకుండా.. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రకరకాల సంకేతాల ద్వారా మనందరినీ హెచ్చరిస్తుంటాయి.
భూమిపై కరవు రాబోతోందని నేరేడు చెట్టు క్లియర్‌గా చూపిస్తుంది. భూగర్భ జలాలు తగ్గుతున్నాయని దానికి ముందే తెలిసేలా.. కొత్త కొమ్మలను ఆపేసి కేవలం పూత, కాయలు పూయడానికి తమ శక్తిని మొత్తం ఉపయోగిస్తుంది. ఫిబ్రవరి, మార్చిలోనే చెట్టు నిండా విపరీతంగా నేరేడు కాయలు కనిపించాయంటే ఆ ఏడాది కరవు రాబోతోందని అర్థం చేసుకోవాలి.
అలాగే చింత చెట్టు కూడా నీటి కొరతను ముందే గ్రహిస్తుంది. ఉగాది కంటే ముందే లేత చిగుళ్లు, దట్టమైన పూతతో నిండిపోతుందంటే కరవు కాలం ముందుందని అర్ధం.
అంతేకాకుండా వేప చెట్టు కరవుకు ముందు డిసెంబర్, జనవరిలోనే నిండా పూత పూస్తుంది. కానీ ఆ గింజల్లో నూనె మాత్రం ఉండదు. ఇలాగే తుమ్మ చెట్టు కూడా కరవు కాలం ముందున్నప్పుడు ఆకులన్నీ రాల్చేసి కేవలం ముళ్లతో ఉంటూ విపరీతంగా కాయలు కాస్తుంది.

అదేవిధంగా భారీ వర్షాలు, వరదలు, కరవు రాబోతున్నప్పుడు మర్రి చెట్టు ఊడలు నేలను తాకకముందే విపరీతంగా పెరిగి భూమిలోకి దిగిపోతాయి. గాలిలో తేమను పీల్చుకోవడానికి వరదలకు నెల రోజుల ముందే చెట్టు ఇలా చేస్తుంది.
అలాగే కొబ్బరి ఆకులు ముదురు ఆకుపచ్చని రంగులోకి మారడం, అడవిలో వెదురంతా ఒకేసారి పూసి చనిపోవడం వంటివి రాబోయే భీకర వరదలకు సంకేతంగా శాస్త్రజ్ఞులు గుర్తించారు .

అంతేకాకుండా భూకంపం రాబోయే ముందు భూమి నుంచి వెలువడే వాయువుల వల్ల.. యూకలిప్టస్, పైన్ ఆకులు ఎల్లో కలర్‌లోకి మారతాయి.
ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో వచ్చే మార్పులతో రావి ఆకులు అతుక్కుపోయి.. శబ్దం చేయడం ఆపేస్తాయి. ఇక తుపానుకు ముందు వాతావరణ పీడనం పడిపోవడంతో తాటి మట్టలు విపరీతంగా రెపరెపలాడతాయి. అటు కానుగ పూలు కడా హఠాత్తుగా రాలిపోతాయి.

వృక్షాలతో పాటు జీవజాలంలో కూడా మార్పులు ఉంటాయి. భూకంపానికి ముందు కుక్కలు ఒకలాంటి వింత శబ్ధంతో మొరగడం, పాములన్నీ పుట్టల నుంచి బయటకు రావడం, చేపలు పైకి ఎగరడం జరుగుతుంది. వరదలు వచ్చే ముందు చీమలు తమ గుడ్లను నోట కరుచుకుని ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటాయి.
ఇలా మన పెద్దలు వృక్షాలతో పాటు జీవజాలంలో కనిపించిన సంకేతాలన్నింటిని కూడా కలిపి.. చూసి రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి అప్రమత్తమయ్యేవారు.
Sweet Potato : బాడీలోని టాక్సిన్స్ బయటకు పంపే స్వీట్ పొటాటో.. ఇంకా చాలా ఉపయోగాలున్నాయ్..





