AP Budget:రూ. 3.32 లక్షల కోట్లతో అభివృద్ధి.. సంక్షేమ పథకాలకు ఏపీ ప్రభుత్వం పెద్ద పీట..
AP Budget: గతంలో 39 వేల 4 వందల 97 కోట్లుగా ఉన్న ఈ వ్యయాన్ని ..ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా 53 వేల 9వందల 15 కోట్లకు చేర్చారు.

AP Budget
ఏపీ రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ వంటి 2026-27 వార్షిక బడ్జెట్(AP Budget)ను .. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం అంచనా వ్యయం 3 లక్షల 32వేల 205 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను కాగ్ తప్పుబట్టడంతో.. ఈసారి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసిన కూటమి ప్రభుత్వం మూలధన వ్యయాన్ని గత బడ్జెట్ కంటే సుమారు 14 వేల నాలుగు వందల పదిహేడు కోట్లు పెంచారు. అంటే గతంలో 39 వేల 4 వందల 97 కోట్లుగా ఉన్న ఈ వ్యయాన్ని ..ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా 53 వేల 9వందల 15 కోట్లకు చేర్చారు.
ఏపీ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి..27 వేల 719 కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకుంది. అలాగే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం..తల్లికి వందనం పథకానికి 9 వేల 668 కోట్లు రూపాయలు, ఉపకారవేతనాలకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు, సమగ్ర శిక్షకు 2 వేల 946 కోట్లు రూపాయలు, ఉన్నత విద్యకు 2 వేల 566 కోట్లు కేటాయించారు.
అంతేకాదు పాఠశాల వసతుల మెరుగుదలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2 వేల 160 ఒక కోట్లు, మన బడి మన భవిష్యత్తుకు పదిహేను వందల కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు 6 వందల 54 కోట్లు కేటాయించడం విశేషం. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందించడానికి నైపుణ్యాభివృద్ధికి 1232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు 707 కోట్లు కేటాయించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. దీపం పథకం కింద రెండు పాయింట్ సున్నా కింద రెండు వేల ఆరు వందల ఒక కోటి, స్త్రీశక్తి పథకానికి పద్నాలుగు వందల ఇరవై కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 4 వేల ఐదు వందల ఎనభై ఒక కోట్లను ఏపీ ప్రభుత్వం ఈ వార్షి బడ్జెట్(AP Budget)లో కేటాయించారు.
ఆరోగ్య రంగంలో ఎన్టీఆర్ వైద్య సేవకు నాలుగు వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్ కు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అందించారు. సామాజిక భద్రతలో భాగంగా వీబీజీ రామ్ జీ కి 8 వేల 3 వందల 65 కోట్లు, గృహ నిర్మాణానికి 5 వేల 451 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతుగా రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు కేటాయించారు.
బలహీన వర్గాల విద్యుత్ సబ్సిడీకి ఆరు వందల కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నాలుగు వందల యాభై కోట్లు, క్రీడలకు 4 వందల 38 కోట్లు దక్కాయి. వ్యవసాయ రంగం ,సాగునీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అన్నదాత సుఖీభవకు 6 వేల ఆరు వందల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల నూట ఐదు కోట్లు, మేజర్ ఇరిగేషన్ పనులకు 9 వేల 906 కోట్లు కేటాయించి రైతులకు భరోసా ఇచ్చారు.
ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్లు, పంటల బీమాకు రెండు వందల యాభై కోట్లు, మత్స్యకార సేవకు రెండు వందల అరవై కోట్లు లభించాయి. జల్ జీవన్ మిషన్ కు నాలుగు వేల కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కు పది వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.
బడ్జెట్ ఆదాయ వనరులను విశ్లేషిస్తే ఏపీకి పన్నుల ద్వారా ముప్పై ఎనిమిది శాతం, బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 30 శాతం, కేంద్ర పన్నుల వాటా పందొమ్మిది శాతం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పది శాతంతో పాటు పన్నేతర ఆదాయం 3 శాతం రూపంలో వస్తున్నాయి. వ్యయాల పరంగా చూస్తే వడ్డీలతో పాటు రుణాల చెల్లింపులకు పద్దెనిమిది శాతం, సంక్షేమానికి

పదిహేడు శాతం, విద్యకు పదకొండు శాతం కేటాయిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిచేస్తూ పన్నెండు పాయింట్ మూడు శాతంగా ఉన్న వడ్డీలను 9 శాతానికి తగ్గించేలా ఆర్థిక సంస్థలను ఒప్పించడం ద్వారా ఏడాదికి దాదాపు 3 వందల 27 కోట్ల భారాన్ని తగ్గించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులకు గానూ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
సంపద సృష్టి కోసం కొత్తగా వంద కోట్ల కార్పస్ ఫండ్ తో ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 85 కేంద్ర పథకాలను 18 వేల 7 వందల ఒక కోటి రూపాయలతో పునరుద్ధరించడం ద్వారా కేంద్ర నిధుల రాకను పెంచింది.
ఆర్థిక లోటును గతంలో కంటే తగ్గించి 75 వేల 8 వందల 68 కోట్లుగా , రెవెన్యూ లోటును 22 వేల రెండు కోట్లుగా అంచనా వేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనడానికి నిదర్శనమని మంత్రి పయ్యావుల వెల్లడించారు.



