Amaravati:కృష్ణా నది ఒడ్డున సాంస్కృతిక హబ్
Amaravati: 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదన..గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతి

Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణాన్ని తిరిగి ఉత్సాహంగా పునఃప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వానికి, గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ కంపెనీ మళ్లీ మద్దతుగా నిలవనుంది. ఈసారి మరింత ఆసక్తికరమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది . అమరావతిలోని కృష్ణానది(Krishna River)కి ఎదురుగా 250 ఎకరాల్లో ‘కల్చర్ డిస్ట్రిక్ట్’ స్థాపనకోసం రెడీ అవుతోంది.
సాంస్కృతిక పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ఈ ప్రాంతాన్ని దేశానికే ,ప్రపంచానికి ఒక సాంస్కృతిక చిహ్నంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సుర్బానా రూపొందించిన ప్రణాళికలను అమరావతి (Amaravati) డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీపార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu)కు వివరించారు. ఈ ప్రతిపాదన అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా మలచే లక్ష్యానికి అనుగుణంగా ఉండనుంది.

ఈ సాంస్కృతిక జిల్లా ప్రాజెక్ట్‌లో భాగంగా నదీముఖ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇది కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు . జీవన నైపుణ్యాలు, చరిత్ర, కళల ప్రాతినిధ్యం, పర్యాటకం అన్నీ కలగలిపే విధంగా డిజైన్ చేయబడిన ఒక గ్రీనరీ ప్రదేశం. ఇది గతంలో నిర్ణయించిన ‘స్టార్ట్అప్ ఏరియా’లోనే అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కల్చర్ డిస్ట్రిక్ట్ లో రివర్ మార్కెట్, ప్రత్యేక ఘాట్, ఎత్తైన గ్రీన్ లాన్లు, క్రాఫ్ట్ విలేజ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, వైవిధ్యభరిత కార్యక్రమాలకు వినియోగించదగిన పెవిలియన్, రెండు నది ఒడ్డులను కలుపుతూ నిర్మించనున్న రిబ్బన్ వాక్ వంటి ఆకర్షణలు ఉండనున్నాయి.

జగన్ పాలనలో మూలంగా అమరావతి నిర్మాణానికి బ్రేక్ పడిన తర్వాత ఇప్పుడు మళ్లీ అభివృద్ధి ఎత్తుకు చేరుతోంది. అంతర్జాతీయ సంస్థల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది మైలురాయిగా నిలవనుంది. సింగపూర్ సంస్థలు మళ్లీ భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం, ఏపీకి సుదీర్ఘ కాలపరంగా లాభదాయకం కావడం ఖాయం.

ఇది కేవలం నిర్మాణం కాదు.. ఇది ఓ సంస్కృతిక విప్లవానికి ఆవిష్కరణ. ఒకవైపు యువతకు ఉపాధి, మరోవైపు పర్యాటకానికి పురోగతి, అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు. ఈ ప్రాజెక్ట్ అమరావతిని నిజమైన రాజధానిగా నిలబెడతుందా అనేది రాబోయే కాలం తేల్చాల్సిన విషయం కానీ.. చైతన్యాన్ని మళ్లీ మేల్కొలిపే ప్రయత్నం మాత్రం మొదలైపోయింది.
Also Read: Rain: వర్షం పడిందా ..మీ రోడ్డు మాయం అయిపోతుంది జాగ్రత్త