AP Farmers: రైతులకు డబుల్ ధమాకా..ఈనెల 19న ఖాతాల్లో రూ.7 వేలు జమ ..ఇలా చెక్ చేసుకోండి
AP Farmers: సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు నేరుగా బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు.
AP Farmers
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతుల(ap farmers)కు శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుండటంతో, ఏపీ రైతులకు ‘డబుల్ ధమాకా’ లభించనుంది.
రాష్ట్రంలోని అర్హులైన రైతుల(ap farmers) ఖాతాల్లో ఈనెల 19వ తేదీన నిధులు జమ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 19న కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు నేరుగా బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు.
ఈ విడతలో ప్రతి రైతు ఖాతాలో మొత్తం రూ. 7,000 జమ కానుంది.అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 5,000 అలాగే పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ. 2,000 జమ కానుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ప్రతీయేటా అర్హులైన రైతులందరికీ మూడు విడతల్లో మొత్తం రూ. 14,000 జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం అందించే రూ. 6,000 (మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున) పీఎం కిసాన్ నిధులకు రాష్ట్రం తరఫున అదనంగా రూ. 8,000 కలిపి మొత్తం రూ. 14,000 అందిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో ఆగస్టు నెలలో రూ. 7,000 రైతుల ఖాతాల్లో జమ అయిన విషయం తెలిసిందే.

ఈ రోజునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద దేశ రైతులకు మొత్తం రూ. 3.70 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ ఇలా చేసుకోవాలి.
‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రైతులు తమ పథకం స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది.
రైతులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ ను సంప్రదించాలి.
హోమ్ పేజీలో కనిపించే ‘Know Your Status’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అక్కడ అడిగే ఆధార్ కార్డు నంబర్ మరియు కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
‘సెర్చ్’ బటన్ నొక్కిన తర్వాత, రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలతో పాటు పథకం స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందా లేదా అనే వివరాలు, అలాగే తొలి విడత డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి వంటి పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
నవంబర్ 19న విడుదల కానున్న ఈ నిధులు రాష్ట్రంలోని రైతు(Farmers) కుటుంబాలకు, ముఖ్యంగా పంట పెట్టుబడి సమయంలో, గణనీయమైన ఆర్థిక చేయూతను అందించనున్నాయి. ఈ పెట్టుబడి సహాయం రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.



