Lokesh :ఏపీటెట్ ఫలితాల విడుదల..విద్యాశాఖలో లోకేశ్ మార్క్ స్పీడ్..!
Lokesh : గత ప్రభుత్వాల హయాంలో నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు నెలల తరబడి సాగే ప్రక్రియను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తి చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
Lokesh
నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయ వృత్తిని ఆశించే లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీటెట్ (APTET) అక్టోబర్-2025 రిజల్ట్‌ను విద్యాశాఖ ఈరోజు (జనవరి 9, 2026) విడుదల చేసింది. గత ప్రభుత్వాల హయాంలో నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు నెలల తరబడి సాగే ప్రక్రియను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తి చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Lokesh ) నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సరికొత్త వేగాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ..అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ, ఏపీ టెట్ అక్టోబర్ 2025 ఫలితాలను ఈరోజు రికార్డు సమయంలో విడుదల చేశారు.
గతేడాది అక్టోబర్ 24న నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి, ఈరోజు జనవరి 9న ఫలితాల ప్రకటన వరకు ప్రతి అడుగును ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా , వేగంగా పూర్తి చేసింది. డిసెంబర్ 21న పరీక్షలు ముగిసిన కేవలం పందొమ్మిది రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం ద్వారా విద్యాశాఖ తన పనితీరును చాటుకుందన్న ప్రశంసలు ఏపీ వాసుల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది టెట్ ఫలితాల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, పరీక్షకు హాజరైన రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది అభ్యర్థులలో.. తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది అభ్యర్థులు అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 39.27 శాతంగా నమోదైంది.

గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా కూడా ఇన్-సర్వీస్ టీచర్ల విభాగంలో మాత్రం 47.82 శాతం మంది పాస్ అయ్యారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఏపీ వ్యాప్తంగా వందకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, 97 శాతం మందికి వారు కోరుకున్న సొంత జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించి ప్రభుత్వం అభ్యర్థుల ప్రయాణ భారాన్ని తగ్గించింది.
త్వరలో రాబోయే డీఎస్సీ (DSC) నియామక ప్రక్రియకు ఈ టెట్ ఫలితాలే కీలకం కానున్నాయి. పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా, నాణ్యమైన ఉపాధ్యాయులను త్వరగా నియమించాలనే మంత్రి లోకేశ్(Lokesh ) లక్ష్యం ఈ వేగవంతమైన ఫలితాలతో నెరవేరుతోంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు పూర్తి స్థాయిలో డీఎస్సీ సన్నద్ధతపై దృష్టి సారించే అవకాశం వస్తుంది.
మొత్తంగా నిర్ణీత కాలవ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల త్వరలో జరగబోయే భారీ డీఎస్సీ నియామకాలకు మార్గం సుగమం అయిందని చెప్పొచ్చు.
Bhimavaram:భీమవరం కోడిపందేలకు హైటెక్ బరులు రెడీ.. కోట్లలో పందేలు,విదేశీ బ్రీడ్ల హంగామా!



