Free Travel:మహిళలకే కాదు వారికి కూడా ఇకపై ఫ్రీ బస్సు జర్నీ.. ఏపీ,తెలంగాణలో ఎప్పటి నుంచి అమలు?
Free Travel: ఇప్పుడు ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని మరింత మందికి వర్తింపజేసే దిశగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.
Free Travel
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఫ్రీ బస్సు (Free Travel ) ప్రయాణ పథకం కూల్‌గా సాగుతోంది. తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో.. ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పేరుతో కొనసాగుతున్న ఈ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు ప్రతిరోజూ జీరో మనీతో ప్రయాణిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ పథకాన్ని మరింత మందికి వర్తింపజేసే దిశగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా దివ్యాంగులైన పురుషులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో పూర్తిస్థాయిలో ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యాన్ని కల్పించడానికి కసరత్తు మొదలైంది.
దివ్యాంగులకు త్వరలో శుభవార్త..= ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దివ్యాంగులకు ఇప్పటివరకూ టికెట్ ధరలో సగం రాయితీ (Concession) మాత్రమే ఉంది. కానీ వీరికి కూడా మహిళల తరహాలోనే వంద శాతం ఉచితం చేయడానికి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా దీనిపై సానుకూల ప్రకటన చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు.. వారిని ఫ్రీ బస్సు ఈ పథకంలో చేరిస్తే ఏపీఎస్‌ఆర్టీసీపై ఎంత భారం పడుతుందనే గణాంకాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై రవాణా శాఖతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 15 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలైతే దివ్యాంగ పురుషులు తమ పనుల కోసం బయటకు వెళ్లినప్పుడు రవాణా ఖర్చుల భారం లేకుండా ప్రయాణించొచ్చు.
ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, సామాజికంగా వారిని మరింత బలోపేతం చేసే చర్య అనే చెప్పొచ్చు.అయితే దివ్యాంగులకు కూడా వంద శాతం ఉచితం చేయాలనే డిమాండ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వినిపిస్తోంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పథకం కాదు, దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
తమిళనాడు..2021లోనే ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. దీనివల్ల మహిళల నెలవారీ ఆదాయం సగటున 8 శాతం వరకు ఆదా అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఢిల్లీ.. ఆప్ ప్రభుత్వం కూడా పింక్ టికెట్ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది.
కర్ణాటక.. శక్తి పథకం ద్వారా అక్కడ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలవుతోంది.
మరోవైపు ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కానీ త్వరలో ఆధార్‌తో పనిలేకుండా ఒక ప్రత్యేక ‘క్యూఆర్ కోడ్ (QR Code)’ కార్డులను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు ఎక్కిన వెంటనే స్కాన్ చేస్తే సరిపోతుంది.
Census: దేశంలో తొలిసారి డిజిటల్ జనాభా లెక్కలు..ఆరోజు నుంచే స్టార్ట్..




One Comment