Just Andhra PradeshLatest News

Bhimavaram:భీమవరం కోడిపందేలకు హైటెక్ బరులు రెడీ.. కోట్లలో పందేలు,విదేశీ బ్రీడ్ల హంగామా!

Bhimavaram: ఒకప్పుడు కేవలం పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో జరిగే ఈ కోడిపందేలు.. ఇప్పుడు ఒక భారీ ఈవెంట్‌లుగా మారిపోయాయి.

Bhimavaram

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలలోని ఊర్లన్నీ కొత్త కళను సంతరించుకుంటాయి. అయితే,ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా భీమవరం(Bhimavaram) పరిసర ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతాయి. ఇక్కడ పండుగ అంటే కేవలం పిండివంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు.. రక్తం ఉడికించే కోడిపందేలు అన్నట్లుగా మారిపోయింది. అందుకే ఎప్పటిలాగే 2026 సంక్రాంతికి భీమవరం బరులు ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమయ్యాయి.

ఒకప్పుడు కేవలం పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో జరిగే ఈ కోడిపందేలు.. ఇప్పుడు ఒక భారీ ఈవెంట్‌లుగా మారిపోయాయి. ఈ ఏడాది భీమవరం(Bhimavaram), ఆకివీడు, ఉండి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పందెం బరులు..పెద్ద పెద్ద కార్పొరేట్ స్టేడియాలను తలపిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో వీఐపీ గ్యాలరీలు, ఏసీ బాక్సులు, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల సౌకర్యార్థం డీలక్స్ భోజన వసతులు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కూడా కల్పించారు. వారధి వంటి పేర్లతో పిలిచే ఈ బరుల్లోకి ప్రవేశించడానికి ఒక్కో టికెట్ ధర.. వేలల్లో పలుకుతుందంటే ఇక్కడి హంగామా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈసారి భీమవరం పందేలల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మన నాటు కోళ్లతో పాటు విదేశీ జాతి కోళ్లు కూడా బరిలోకి దిగబోతున్నాయి. ముఖ్యంగా పెరూ, బర్మా, బ్రెజిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక జాతి పుంజులు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విదేశీ కోళ్లు చూడటానికి భారీగా ఉండటమే కాకుండా, పందెంలో చాలా వేగంగా రియాక్టవుతాయి. మన ఊరి పుంజులైన కాకి, డేగ, నెమలి, పర్ల వంటి వాటితో ఈ విదేశీ పుంజులు తలపడనుండటంతో పందెం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Bhimavaram
Bhimavaram

పందెం కోళ్లకు ఇచ్చే శిక్షణ, ఆహారం వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కో పుంజును ఒక అథ్లెట్‌లా తయారు చేస్తారు. వీటికి ఇచ్చే లడ్డూలు చాలా స్పెషల్. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను మెత్తగా చేసి, ఆ పౌడర్‌లో ఉడికించిన కోడిగుడ్డు తెల్లసొన, చిన్న చిన్న మాంసం ముక్కలు కలిపి ప్రత్యేకంగా తయారు చేసి లడ్డూగా అందిస్తారు. వీటితో పాటు విటమిన్ టానిక్‌లు, కండరాల పుష్టి కోసం రోజూ ఈత కొట్టించడం, ఎండలో నడిపించడం వంటివి చేస్తారు. ఒక్కో పుంజు ధర కొన్ని లక్షల రూపాయల వరకు పలుకుతుందంటే, వాటి సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేస్తారో ఊహించొచ్చు.

సంక్రాంతి మూడు రోజుల్లో భీమవరం(Bhimavaram) పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. కేవలం కోడిపందేల మీద కాకుండా, వీటి అనుబంధంగా హోటల్ బిజినెస్, రవాణా, గెస్ట్ హౌస్‌ల అద్దెలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా సందర్శకులు ఈ కోడి పందేలను చూడటానికి వస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ బరుల వద్దే తిష్ట వేస్తుంటారు. పందెంలో గెలిచిన వారికి నగదుతో పాటు ఖరీదైన కార్లు, విదేశీ ప్రయాణాలు వంటి బహుమతులు కూడా ఉండటంతో ఈ కోడి పందేలకు ఏడాదికేడాది క్రేజ్ పెరిగిపోతుంది.

శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా, భీమవరం సంస్కృతిలో భాగంగా మారిపోయిన ఈ కోడిపందేలను చూడటానికి జనం పోటెత్తుతూనే ఉంటారు. ఇది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, వేల మందికి ఉపాధి కల్పించే ఒక భారీ నెట్‌వర్క్ అనే స్థాయికి చేరుకుంది. అందుకే ఈ ఏడాది కూడా భీమవరం పసిడి వెలుగులతో పాటు పందెం పుంజుల రణరంగంగా మారడానికి సిద్ధమైంది.

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్‌లు దేనికి సంకేతం ? పదే పదే వైసీపీ డివైడ్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతోంది?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button