Just Andhra PradeshLatest News

Vijayawada:విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు ఖతం..వారధి నుంచి గంగూరు వరకు మెగా ఫ్లైఓవర్

Vijayawada :వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి వంటి ట్రాఫిక్ ప్రాంతాల్లో గంటల తరబడి వేచి ఉండే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

Vijayawada

విజయవాడ నగరవాసులకు, మెయిన్‌గా ప్రతీరోజూ ట్రాఫిక్‌తో సతమతమవుతున్న వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే తీపి కబురు అందించింది.ఒక్క బెంజ్ సర్కిల్ దాటాలంటేనే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చేది . కానీ ఇకపై అలా వెయిట్ చేసే రోజులకు ఇక కాలం చెల్లనుంది.

హైదరాబాద్ టు మచిలీపట్నం నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఏకంగా 14 కి.మీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించడానికి భారీ ప్రణాళిక రెడీ అయింది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే బెజవాడ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే అవుతుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ(Vijayawada )వరకు, అటు మచిలీపట్నం వైపు నుంచి సిటీ వరకు రోడ్లు ఆరు వరుసలుగా మారుతున్నాయి. కానీ సిటీ లోపలకు వచ్చేసరికి మాత్రం కేవలం నాలుగు వరుసల రోడ్డు మాత్రమే ఉండటం వల్ల బాటిల్ నెక్ సమస్య వస్తోంది.

దీనిని అధిగమించడానకి ఇళ్లు, షాపులు వారిని వేరే చోటుకు తరలించి.. స్థలాలు సేకరించడం అనే తలనొప్పి లేకుండా.. డైరక్టుగా గాల్లోనే వంతెన నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. బస్టాండ్ సమీపంలో రాజీవ్ పార్క్ నుంచి ప్రారంభమై గంగూరు సర్కిల్ వరకు ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్ సాగుతుంది. అయితే ఇప్పటికే విజయవాడ (Vijayawada )బెంజ్ సర్కిల్ వద్ద రెండు ఫ్లైఓవర్లు ఉండటం కాస్త ప్లస్‌గా మారడంతో , వాటిపై నుంచి మూడో లేయర్ లాగా దీనిని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది. .

Vijayawada
Vijayawada

ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి వంటి ట్రాఫిక్ ప్రాంతాల్లో గంటల తరబడి వేచి ఉండే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. హైవే మీద వెళ్లే వెహికల్స్ అన్నీ నేరుగా ఫ్లైఓవర్ పైనుంచి దూసుకుపోతాయి.

సిటీవాసులంతా తమతమ వాహనాలతో హాయిగా కింద రోడ్డు మీదనుంచే వెళ్లొచ్చు. భూసేకరణ సమస్య కూడా తక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్ గనుక పూర్తయితే విజయవాడ సిటీ భౌగోళికంగా ఒక మెట్రో సిటీ రేంజ్‌లో కొత్త రూపును దిద్దుకుంటుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button