Just SportsLatest News

Womens Asia Cup : భారత్ దే ఆసియా రైజింగ్ టైటిల్..ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు

Womens Asia Cup : మహిళల క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వుమెన్ ఇండియా ఇప్పుడు ఆసియా స్థాయిలోనూ దుమ్మురేపుతోంది.

Womens Asia Cup

మహిళల క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వుమెన్ ఇండియా ఇప్పుడు ఆసియా స్థాయిలోనూ దుమ్మురేపుతోంది. యువక్రికెటర్లతో కూడిన జట్లతో నిర్వహించిన ఆసియాకప్ (Womens Asia Cup)రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

తక్కువ స్కోరే చేసినా కూడా భారత్ తన అద్భుతమైన బౌలింగ్ తో దానిని కాపాడుకుంది. బంగ్లాకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏ మహిళల జట్టు ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. తొలి వికెట్ కు ఓపెనర్లు నందిని, వృంద దినేశ్ 30 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వెంటనే మరో 2 వికెట్లు కోల్పోయింది. 44 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకోవడంతో స్కోరు 100 అయినా దాటుతుందా అనిపించింది.

ఈ దశలో తేజ, కెప్టెన్ రాధా యాదవ్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఐదో వికెట్ కు 69 పరుగులు జోడించారు. ఈ క్రమంలో తేజ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాధా యాదవ్ 36 పరుగులు చేసింది. చివర్లో మరో మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ 20 ఓవర్లలో 134 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో లంక కెప్టెన్ ఫహీమా 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీసింది.

Womens Asia Cup
Womens Asia Cup

భారీ లక్ష్యం కాకపోవడంతో బంగ్లాదేశ్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే భారత్ బౌలర్లు మాత్రం లైన్ అండ్ లెంగ్త్ తో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు.షమీమా సుల్తానా (20), షరీమ్ సుల్తానా(18) మాత్రమే ఓ మాదిరిగా బ్యాటింగ్ ఆడగలిగారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు.భారత బౌలర్లలో ప్రేమా రావత్ 3 వికెట్లు, తనుజా , సోనియా రెండేసి వికెట్లు పడగొట్టారు. సైమా, మిన్ను మణి, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ వుమెన్ ఆసియా కప్ (Womens Asia Cup)టోర్నీని భారత్ ఘోరపరాజయంతో ప్రారంభించింది. అనూహ్యంగా యూఏఈ చేతిలో చిత్తుగా ఓడింది. అయితే తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా పాకిస్థాన్, నేపాల్ జట్లపై గెలిచి సెమీస్ కు చేరింది. ఇక సెమీఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్ ఏ జట్టు టైటిల్ పోరులో బంగ్లాను ఓడించింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button