Water disputes:తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు చర్చలే పరిష్కారమా? గత ఉదాహరణలు ఏం చెబుతున్నాయి?
Water disputes: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం ఉంటూనే ఉంది.
Water disputes
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల మధ్య విభజన తర్వాత అనేక అంశాల్లో విభేదాలు ఉన్నా కూడా.. అత్యంత కీలకమైన, సున్నితమైన వివాదంగా జల వివాదం(Water disputes) నిలిచిపోతుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం ఉంటూనే ఉంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న గొడవలు వద్దు.. చర్చల ద్వారానే పరిష్కారం అనే కొత్త పంథా ఇప్పుడు రెండు రాష్ట్రాల రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
సామరస్య పూర్వక చర్చల వెనుక ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్..రాజకీయంగా విమర్శలు ఎన్ని ఉన్నా, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ఒకరికొకరు సహకరించుకోవాలనేది ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రధాన ఉద్దేశం. రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో తరచుగా ఒక మాట చెబుతుంటారు.. మనకు కావాల్సింది రాజకీయ పంచాయితీలు కాదు, మన భూములకు నీళ్లు.
ఇదే అభిప్రాయాన్నే ఏపీ సీఎం చంద్రబాబు కూడా వ్యక్తం చేస్తుంటారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు, గొడవల వల్ల ప్రాజెక్టులు ఆగిపోవడం తప్ప.. రైతులకు ఒరిగేదేమీ లేదని బాగా తెలుసు. అందుకే, గత ప్రభుత్వాల హయాంలో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన వివాదాలను కూడా ఇప్పుడు స్నేహపూర్వక చర్చలతో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల చరిత్రను గమనిస్తే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో కలిసి నీటి ప్రాజెక్టుల(Water disputes) విషయంలో అనేక సార్లు నిర్మాణాత్మక చర్చలు జరిపారు. 2004లో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో కూడా ఇలాంటి ఒక అవగాహన కనిపించింది.
విభజన తర్వాత 2014-18 మధ్య చంద్రబాబు, కేసీఆర్ మధ్య చిన్నపాటి ఉద్రిక్తతలు ఉన్నా, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పెద్దగా అడ్డంకులు కలగలేదు. అలాగే 2019-21 మధ్య జగన్ , కేసీఆర్ మధ్య అయితే ఒక దశలో అద్భుతమైన సమన్వయమే ఉండేది. హంద్రీనీవా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అంశాల్లో కలిసి కేంద్రానికి విన్నవించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ (కాంగ్రెస్) , చంద్రబాబు (టీడీపీ) మధ్య ఉన్న ఈ బాండ్ పాత ప్రూవెన్ ఫార్ములాను గుర్తుకు తెస్తోంది.

చర్చల ద్వారా నీటి సమస్యలు పరిష్కారమైతే ముందుగా లబ్ధి పొందేది రైతులే. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు త్వరగా లభిస్తాయి. ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టాలు తీరడంతో పాటు, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ నుంచి మరింత సహకారం అందుతుంది. ముఖ్యంగా పోలవరం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ఇష్యూలు పరిష్కారమైతే, రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు రావడం కూడా ఈజీ అవుతుంది. అంతా సవ్యంగా సాగితే 2026 చివరి నాటికి అనేక సాగునీటి వివాదాలకు శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉంది.
అయితే ఈ సామరస్య పూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికి రాజకీయ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్.. తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని లేదా ఏపీకి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనే ఒక నరేటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అలాగే కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఈ ఇద్దరు నేతల బంధానికి పరీక్షగా నిలిచే అవకాశం ఉంది. ఏది ఏమైనా చర్చలే మార్గం అని నమ్ముతున్న ఈ ఇద్దరు సీఎంల నిర్ణయం ..రెండు రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలని ఆశిద్దాం.
Lokesh :ఏపీటెట్ ఫలితాల విడుదల..విద్యాశాఖలో లోకేశ్ మార్క్ స్పీడ్..!




One Comment