Gold:ఒక్క రోజులోనే మళ్లీ షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold: దీపావళి కొనుగోళ్ల తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయనుకున్న సమయంలో, శనివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరపై ఏకంగా రూ.1,250 మేర పెరిగింది.
Gold
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా బంగారం(Gold) ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా ఐదు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధర, ఒక్కసారిగా మళ్లీ భారీగా పెరిగింది. ఈ ఊహించని మార్పు బంగారం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దీపావళి కొనుగోళ్ల తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయనుకున్న సమయంలో, శనివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధరపై ఏకంగా రూ.1,250 మేర పెరిగింది. ఇటీవల రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధరలు ఇప్పుడు రూ.1.24 లక్షల స్థాయికి దిగొచ్చినా కూడా, ఈ ఒక్కరోజు పెరుగుదల పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి ధర మాత్రం శనివారం స్థిరంగా కొనసాగుతోంది.
నేటి (అక్టోబర్ 25, 2025) బంగారం, వెండి ధరలు:
పలు వెబ్సైట్ల ఆధారంగా, శనివారం (అక్టోబర్ 25, 2025) దేశీయంగా ధరలు ఈ విధంగా ఉన్నాయి:
రకం పెరుగుదల నేటి ధర (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం రూ.1,250 రూ.1,25,620
22 క్యారెట్ల బంగారం రూ.1,150 రూ.1,15,150
వెండి ధర కిలోకు రూ.1,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ధరలు:
తెలుగు రాష్ట్రాల్లోనూ, ప్రధాన నగరాల్లోనూ శనివారం ధరలు ఈ విధంగా ఉన్నాయి (అన్నీ 10 గ్రాములకు):
ప్రాంతం 24 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారం కిలో వెండి ధర
హైదరాబాద్ రూ.1,25,620 రూ.1,15,150 రూ.1,70,000
విజయవాడ/విశాఖపట్నం రూ.1,25,620 రూ.1,15,150 రూ.1,70,000
ముంబై రూ.1,25,620 రూ.1,15,150 రూ.1,55,000
ఢిల్లీ రూ.1,25,770 రూ.1,15,300 రూ.1,55,000
చెన్నై రూ.1,25,450 రూ.1,15,000 రూ.1,70,000

కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడానికి ప్రధానంగా లాభాల స్వీకరణ (Profit Booking), మరియు డాలర్ పుంజుకోవడం కారణమయ్యాయి. అయితే, తాజాగా ధరలు మళ్లీ పెరగడానికి ప్రధానంగా ఈ కింది అంశాలు దోహదపడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ అనిశ్చితి.. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి (Geopolitical Instability) ,ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు మళ్లీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా (Safe Haven) భావించి కొనుగోళ్లకు మొగ్గు చూపడం ప్రారంభించారు.
ఫెస్టివల్ డిమాండ్.. దేశీయంగా పండగల సీజన్ , వివాహాల సీజన్ కారణంగా డిమాండ్ మళ్లీ పెరగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) తమ నిల్వలను పెంచుకునేందుకు బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా రేట్లు పెరగడానికి దోహదపడుతుంది.
బంగారం(Gold) ఇప్పుడే కొనొచ్చా అనే ప్రశ్నకు నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, దీర్ఘకాలికంగా (Long Term) మాత్రం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణం (Inflation) భయాలు , కరెన్సీ విలువలు తగ్గుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బంగారం సురక్షిత పెట్టుబడిగా కొనసాగుతుంది. ఒకవేళ కొనుగోలు చేయాలనుకుంటే, ధరలు తగ్గుతున్న ప్రతిసారీ కొద్ది మొత్తంలో క్రమబద్ధంగా పెట్టుబడి (Systematic Investing) పెట్టడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.



