America:అమెరికాలో తెలుగు యువతి హత్య.. నిందితుడు ఎక్కడ దొరికాడంటే.. ?
America:అమెరికాలో భారతీయ సంతతి యువతి దారుణ హత్య.. మాజీ ప్రియుడి ఇంట్లో లభ్యమైన మృతదేహం
America
అమెరికాలో(America) సంచలనం సృష్టించిన తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అర్జున్ శర్మ దొరికాడు. ఆమెను చంపేసి భారత్ పారిపోయి వచ్చిన అర్జున్ శర్మను ఇంటర్ పోల్ అధిాకారులు, తమిళనాడు పోలీసుల సాయంతో పట్టుకున్నారు.ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ కు చెందిన నిఖిత మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు వెళ్ళారు. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని వెడా హెల్త్‌లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల నూతన సంవత్సర వేడుకల తర్వాత ఆమె కనిపించలేదని మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న ఆమె అపార్ట్ మెంట్ లోనే తాను చివరిసారిగా నిఖితను చూసినట్టు పోలీసులకు చెప్పాడు.
ఆ తర్వాత అర్జున్ శర్మ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి అతను ఉంటున్న అపార్ట్ మెంట్ ను తనిఖీ చేయగా.. నిఖిత మృతదేహం బయటపడింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు.
అర్జున్ శర్మ ఇండియాకు పరారవడంతో అతనిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఇంటర్ పోల్ పోలీసుల సాయంతో అప్పటి నుంచీ గాలిస్తుండగా.. ఎట్టకేలకు తమిళనాడులో అర్జున్ శర్మ పట్టుబడ్డాడు. ఇదిలా ఉంటే తమ కుమార్తె హత్యకు గురైందని తెలిసిన నిఖిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చివరిసారిగా న్యూ ఇయర్ విసెష్ చెప్పిందని గుర్తు చేసుకున్నారు.

ఆమె రూమ్ మేట్ గా ఉంటున్న అర్జున్ శర్మనే నిఖితను చంపేసాడని ఆమె తండ్రి ఆనంద్ గోడిశాల చెబుతున్నారు. అమెరికాలో (America) ఉంటున్న అర్జున్ తన కుమార్తెకు స్నేహితుడు మాత్రమేనని, ప్రియుడు కాదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చాాలాసార్లు నిఖిత దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆమె తండ్రి చెబుతున్నారు.
4600 డాలర్లు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో నిఖిత పదేపదే అడగ్గా గొడవ మొదలైనట్టు భావిస్తున్నారు. 3600 డాలర్లు తిరిగి ఇచ్చిన తర్వాత మిగిలిన 1000 డాలర్ల కూడా ఇవ్వాలని నిఖిత కోరడంతో కోపంతో ఆమెను చంపేసాడని నిఖిత తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమార్తెన్ చంపిన అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నిఖిత మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. కాగా అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు అతన్ని అమెరికా (America) పోలీసులకు అప్పగించనున్నారు.




2 Comments