Just Literature

Literature : అదే నేల… అదే గాలి…

Literature :ఏమిస్తున్నావు..? నీ తరువాత తరానికి..

Literature :

 

ఏమిస్తున్నావు..?

నీ తరువాత తరానికి..

కూడేసిన ధనమా?

కట్టేసిన భవనమా?

 

నీరు లేక బీటలేసిన భూమి

గూడు లేక గతిస్తున్న ప్రాణి

తరువు తెగి మోడు తేలిన వనం

కాలం తప్పి వీస్తున్న పవనం

చేతులారా మోసుకొచ్చిన ఆపద

ఇదేనా నువ్వందించే వారసత్వ సంపద?

 

మేటేసిన ఇసుక దిబ్బలు

కోటలకై పోయాయి..

కొట్టేసిన తరువు ముక్కలు

ఇంటిలో ఒదిగిపోయాయి..

ద్రవ్యం దాహాన్ని తీర్చగలదా?

భవనం చిగురించగలదా?

 

పుష్పాల సుగంధం పొగచూరుకుంది

పక్షులతో చెట్టుబంధం తెగిపోయింది!

చినుకు రాల్చని ఆకాశాన్ని చూస్తూ

విత్తనాలు భూమిలో వట్టిపోతున్నాయి!

గాలి మూలిగిన జాడలలో

నీ వారసత్వం ఊపిరి వెతుకుతాది..!

 

కొండలలో ధూళి మేఘాలు

వాన చినుకుల్లో విషం

నీ అడుగుల జాడలు చూస్తే

కానలలో ఎడారి అగుపిస్తాది!

ఏటి పాయలలో ఇంకిన నీరు

కంటి లోపల ఊరుతాది..!

 

అదే నేల… అదే గాలి…

కానీ నీ తరం వాసన

పెనుభూతంలా వెంటాడుతుంది

నీ నిర్లక్ష్యం తరువాత శ్వాసలో…

 

అయినా ఆశిస్తున్నాం

ఒక రోజు…నువ్వు మేల్కొంటావని!

అప్పుడు చెప్పు..

నీ తరువాత తరానికి

ఏమిస్తున్నావో..!

– ఫణి మండల

8555988435

36 Comments

  1. “Each stanza carries a depth of meaning that touches the soul.”

  2. చాలా స్ఫూర్తివంతంగా ఉన్నది.. ప్రతి ఒక్కరూ మరొకరికి షేర్ చేసి చైతన్యం చేయాల్సిందే

  3. భవిష్యత్తు కోసం …వర్తమానాన్ని ఆలోచింపచేసే సాహిత్యం…బాగుంది సర్

  4. ఒక మనిషిని మేల్కొలపడానికి, తాను ఇప్పటి వరకు ఏమిచేసినా, చేయకపోయినా ఇకపై ఏదోఒకటి చేయాలనే ఆలోచన కలిగించేలా ఉన్న ఈ మాటలు ఇప్పటి తరానికి చాలా బలంగా అవసరం… దీనిని కవిత అనాలో, లేక ఆవేదన అనాలో లేక మరేదైనా అనాలో తెలీదుకానీ ఇది మాత్రం చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి.. ఈ బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలి..

  5. బాగుంది.మరొక్కసారి మన బాధ్యతను గుర్తుకు తెచ్చింది.

  6. నీ కవితలు సమాజంలో మంచి మార్పు తేసుకురావాలి అని కోరుతున్నాను.

  7. ఫణిగారు…
    Excellent….

    మీ హెచ్చరిక మనకే…
    చదివేసి వదిలేస్తే ఇంతే..
    మనగతి ఇంతే…
    తరువాత తరం దిగజారుడు కొండంతే..
    మార్చగలిగే సత్తా మనకులేదంతే..
    ఊబిలో చిక్కుకున్నాక ఏమీచేయలేమంతే..

    ఈ తరం నిర్లక్ష్యపు వాసన దుర్వాసనగా మారి, చతికిలబడి స్వార్ధపు చింతనకు అలవాటుగా మారాక ఇంకేం చేయగలం!!
    చదివి మేల్కొనేలోపే మరచి మామూలైపోతున్నాం. మరో కొత్త సందేశం చదివి క్షణకాలం తాత్కాలిక సంతోషం పొంది చతికిలబడిపోతున్నాం..
    ఇక మారేదెప్పుడో!!
    చూడాలి…
    వేచి చూడ్డమే మిగులుతుంది….

  8. నేను నీవైన వేళ

    అదేనీవు…అదేనేను.
    నీవు తెలుగు తనపు పారవశ్యపు పరిమళం …
    నేను తెల్గు తనపు పర వశంతో వాసం.
    నువు ఆ అమృత భాషా సాహిత్యంతో సహవాసం…
    నేను ఆ మృత భాషా శకలాలతో ఆవాసం.
    నీవు పూర్ణకుంభమై పూజలందుకున్నావ్…
    నేను కొరగాని కొరివినై చేష్టలుడిగి చూస్తున్నా.
    నన్ను నేను తెలుసుకున్న వేళ…
    తెలుగు జిలుగుల వెలుగై….
    నాలో అంధకారాని అదృశ్యం చేసిన వేళ….
    నేను నీవైన వేళ…. నాకు తెలిసింది
    నేను పుట్టిన నేల తెలుగు…
    నేను తిన్న తిండి తెలుగు…
    నేను కట్టిన బట్ట తెలుగు…
    నా ఉచ్చ్వాస నిశ్వాసాలు తెలుగు.
    నా ఉనికి తెలుగు…
    నా జీవితం తెలుగు…
    నా సర్వస్వం తెలుగు…
    నా మతిని గతిని మార్చిన మీ
    అదే గాలి…అదే నేల…కు
    నిలకడల జెండానై…దిక్సూచినై….
    నా తరువాత తరానికి ….
    వారధినై నిలుస్తాను.

  9. నేటి తరాలకు మీరిచ్చిన సందేశం అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో మనిషి మనుగడ సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ఇప్పటికే గాడి తప్పిన అనేక విషయాలను మీరు కవిత రూపంలో మనసుకు హత్తుకునేలాగా తెలియజేశారు. ఇది ఏ ఒక్కరో కాదు ప్రతి ఒక్కరు ఆలోచించేలా ఉంది. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ప్రకృతి పట్ల కలిగి ఉండాల్సిన స్పృహను తెలియజేశారు. ప్రకృతి ప్రళయతాండవం చేయకముందే మనం గుర్తు ఎరిగి చేసిన తప్పులను సరిదిద్దుకునేలా కృషి చేయాలి. అప్పుడే భావితరాలు ఈ భూమ్మీద మనుగడ సాగించగలవు. ఆ దిశలో మీరు చేసిన ఉద్బోధ అనిర్వచనీయం. 🙏🙏🙏🙏

  10. Exactly what’s the present situation is…atleast ippatikyna Let’s try to give our future generations Nature with its original nature as big gift..

  11. మంచి మాట మనసుకు హత్తుకునే ఒక హెచ్చరిక. చాలా బాగుంది మనిషి తన కళ్ళముందు జరుగుతున్న వినాశనం చూస్తూనే నిర్లిప్తం గావున్నాడు. కనీసం అంతర్మధనం ద్వారా తనను తాను ప్రశ్నించుకునే విధానం బాగుంది.

  12. మొదటి అడుగు మనదై భావితరాలను నడిపించాలి… excellent sir.

  13. Nijame kada.manam ami chestunnam next generations kosam aalochimpajestundi gaa vundi kavita.superrr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button