Srishti fertility center: డాక్టర్ నుంచీ దలారీల వరకు… సృష్టి మాయ: 80 బిడ్డల అక్రమ విక్రయం కథ!
Srishti fertility center: ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఓ గర్భధారణ మాఫియాకు సంబంధించిన నిజాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి

Srishti fertility center
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఓ గర్భధారణ మాఫియాకు సంబంధించిన నిజాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ (Srishti fertility center) ఫెర్టిలిటీ క్లినిక్ పేరుతో నడుస్తున్న ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్’లో, సరోగసి పేరుతో చిన్నపిల్లల వ్యాపారం జరుగుతోందన్న సంగతి గోపాలపురం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇప్పటి వరకు 27 మందిని అరెస్టు చేసిన వారు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో సుమారు 80 మందికి పైగా పుట్టిన చిన్నపిల్లలను అత్యంత వ్యాపార మూలధనంగా అమ్ముకుని దాదాపు రూ. 20 కోట్లకు పైగా గడించింది.
డాక్టర్ నమ్రత క్లినిక్ని (Srishti fertility center) మరికొందరు మేనేజర్లు, ఏజెంట్లు సహాయంతో నిర్వహించిందని తెలుస్తోంది. ఈ నెట్వర్క్ సరోగసి అంశాన్నే ఒక ప్రొఫెషనల్ వ్యాపారంగా మలచి, సంఘంలో పిల్లలు లేని కుటుంబాల కన్నీళ్లు దోచడంతో ముగిసింది కాదు – అక్రమంగా తల్లులు తయారు చేయించి, పుట్టిన శిశువులను పెద్ద మొత్తాలకు ఎవరికిచ్చారన్నది ఈ వ్యవస్థ భయానకతను నిరూపిస్తోంది. ఒక్క బిడ్డకు 30 లక్షలు నుండి 50 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై స్పెషల్ టీమ్ పెట్టిన పోలీసులు, డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీలో వేసి విచారించారు. ఆమె ఫోన్, బ్యాంక్ డేటా, పాసుపుస్తకాలు, క్లినిక్ రిజిస్టర్లను ఫోరెన్సిక్గా విశ్లేషించుతున్నారు. ఆమె ఇంతవరకూ సమర్పించిన సమాచారంలో అనేక ఆర్థిక అక్రమాల ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా ఆమె పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. తరచూ విదేశీ ప్రయాణాలు, నగదు లావాదేవీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.

పిల్లల ట్రాఫికింగ్కు సంబంధించి చట్టరంగ అభియోగాలు, IPC సెక్షన్లు 370, 420, 120Bతో పాటు, చైల్డ్ ప్రొటెక్షన్, పీఏన్ డీటీ యాక్ట్, సరోజసి రెగ్యులేషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసు వెలుగులోకి రావడంతో సరోజసి రంగంలోని నిబంధనలపై తిరిగి సమీక్ష అవసరం ఉందన్న చర్చ మొదలైంది. ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రభుత్వానికి మరింత నిఘా అవసరం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: Uttarkashi video: ఉత్తరకాశీలో మృత్యుంజయులు ..వీడియో వైరల్