Anasuya : చెప్పు తెగుద్ది..అనసూయ ఘాటు వార్నింగ్
Anasuya: . తాజాగా చెప్పు తెగుద్ది అంటూ చేసిన కామెంట్లతో అనసూయ డేరింగ్ అండ్ డేషింగ్ మైండ్ సైట్ మరోసారి బయటపడింది.

Anasuya
ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై తన సత్తా చూపించిన అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), మరోసారి సోషల్ మీడియా(social media)ను హడలెత్తించారు. అయితే ఇప్పుడు గ్లామర్ గానీ, సినిమా ప్రమోషన్స్ గానీ కాదు . ఆమె గళం విరుచుకుపడిన తీరు, సమాజానికి వేసిన ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
అనసూయ తాజాగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి)(shopping mall opening వెళ్లింది. ఎప్పటిలాగే అభిమానులు వేల సంఖ్యలో వచ్చారు. కానీ వారిలో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు.
బహిరంగ వేదికపై ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్య వ్యాఖ్యలు చేయడం ఆమె సహించలేకపోయింది. క్షణాల్లో వాళ్ల మీద ఓపెన్‌గా విరుచుకుపడింది . చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్యపై ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా?’ అంటూ గట్టిగా నిలదీసింది.
ఈ సంఘటనపై రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహిళలపై అవమానకర కామెంట్లు చేస్తూ, ట్రోలింగ్ అనే పేరుతో నానా రచ్చ చేయడం ఇప్పుడు ఓ భయంకరమైన సమస్యగా మారింది. కానీ అనసూయ తీసుకున్న ఈ ధైర్యమైన స్టాండ్ మిగిలినవారికి కూడా ఓ రోల్ మోడల్ గా నిలుస్తోందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
ఇది తొలిసారి కాదు. అనసూయ తరచూ ట్రోలింగ్‌కు గురవుతూ వచ్చినా, అదే స్థాయిలో స్పందిస్తూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇద్దరు పిల్లల తల్లివి, నీకు ఇలాంటివి అవసరమా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తే, వాళ్లకు ధీటైన సమాధానం ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది.

ఒక ఇంటర్వ్యూలో తానతో అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోను.. అందుకే 30 లక్షల మంది ఫాలోవర్లను బ్లాక్ చేశా’అంటూ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా చెప్పు తెగుద్ది అంటూ చేసిన కామెంట్లతో అనసూయ డేరింగ్ అండ్ డేషింగ్ మైండ్ సైట్ మరోసారి బయటపడింది.
Also read: Anasuya : డిజిటల్ ప్రపంచంతో అనసూయ వార్
2 Comments