Just EntertainmentLatest News

Aaya Share Song:ఆయా షేర్‌ సాంగ్‌పై ఆగని నెగిటివ్ కామెంట్లు.. యాంటీ ఫ్యాన్స్ తీరు ఎందుకు మారడం లేదు..

Aaya Share Song: ఆయా షేర్ సాంగ్ తెలుగు పాటలా లేదని, మలయాళ ట్యూన్‌లా ఉందని, సాహిత్యం అర్థం కావడం లేదంటూ ఓ రేంజ్‌లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Aaya Share Song

దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నేచురల్ స్టార్ నాని , డైరెక్ట్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో నాని రెండు జడలతో సరికొత్త పాత్రలో కనిపిస్తున్నారు.

రెండు జడలతో నాని మేకోవర్ చూస్తున్న అభిమానులు ఈసారి బాక్సాఫీస్ దగ్గర రా అండ్ రస్టిక్ అరాచకం మామూలుగా ఉండదని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్(Aaya Share Song) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిరుధ్ అందించిన మాస్ మ్యూజిక్‌కు.. నేచురల్ స్టార్ నాని వేసిన హుక్ స్టెప్స్ తోడవ్వడంతో ఈ సాంగ్ క్షణాల్లో వైరల్ అయ్యి.. చార్ట్ బస్టర్ లిస్టులో చేరిపోయింది. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం… మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కిక్‌ను ఇస్తోంది.

అయితే ఏ పెద్ద హీరోకి అయినా, ఎలాంటి పెద్ద సినిమాకైనా సోషల్ మీడియాలో నెగిటివిటీ మాత్రం కామన్ అయిపోయింది. ఇప్పుడు నాని పాటపై కూడా కొంతమంది విమర్శలు మొదలుపెట్టేశారు. ఆయా షేర్ సాంగ్(Aaya Share Song) తెలుగు పాటలా లేనే లేదని, మలయాళ ట్యూన్‌లా ఉందని, సాహిత్యం అర్థం కావడం లేదంటూ ఓ రేంజ్‌లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

కానీ నాని ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్లను గట్టిగాన తిప్పికొడుతున్నారు. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాబట్టే, ఆ కాలం నాటి యాసను ప్రతిబింబించేలా కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యం ఇచ్చారని క్లారిటీ ఇస్తున్నారు. కావాలనే కొంతమంది నాని ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్, నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.

నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హీరోలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, చాలా స్నేహంగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాన్ వార్స్ వల్లే మంచి సినిమాలపైన కూడా అనవసరమైన నెగిటివిటీ పెరుగుతోంది. ఒక మూవీ బాగుంటే అందరూ ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బాగోకపోతే అయ్యో అని అనుకోవాలి. కోట్లుకు కోట్లు డబ్బులు పెట్టి ప్లాప్ సినిమా తీయాలని ఎవరూ అవ్వాలని అనుకోరు .

Aaya Share Song
Aaya Share Song

ఒక సినిమా హిట్ అయితే హీరో, ప్రొడ్యూసర్, డైరక్టర్లకు పేరు , డబ్బులు రావడమే కాదు దీనినే నమ్ముకున్న ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోని తెరవెనుక కళాకారులకు కూడా జీవితాన్ని ఇస్తుంది. కావాలని చేసే నెగిటివ్ కామెంట్లతో తాము ఇష్టపడని హీరో మాత్రమే లాస్ అవరు. ఎంతోమంది సినీ కళాకారులను రోడ్డున పడేస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా కేవలం హీరోలపై ద్వేషంతో పాటలను, సినిమాలను ఇలా తక్కువ చేసి మాట్లాడటం టోటల్ సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి.

ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అయితే అది ఎదుటివారిని కించపరిచేలా చేస్తూ తమ హీరో గొప్ప అని చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సినిమాను ఒక ఆర్టుగా చూసినప్పుడు మాత్రమే ఇలాంటి నెగిటివ్ ట్రెండ్స్ ఆగుతాయి. మరి ఇప్పుడు ఆయా షేర్‌ పాటపై వస్తున్న విమర్శలకు నేచురల్ స్టార్ నాని తన పెర్ఫార్మెన్స్‌తో ఎలా సమాధానం చెబుతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button