Vijay-Rashmika:విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ లేఖ..ట్రెండింగ్‌లో ఆ స్పెషల్ లెటర్
Vijay-Rashmika: సోషల్ మీడియాలో #ModiBlessesVirosh అనే హ్యాష్ ట్యాగ్ ఏకంగా 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది.
Vijay-Rashmika
సెన్సేషనల్ అండ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Vijay-Rashmika)ల పెళ్లి మరికొద్ది గంటల్లో అంటే.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరగబోతోంది.ఇప్పటికే దీనికోసం అన్ని ఏర్పాట్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక లేఖ తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా దేశాధినేతలు ఇలాంటి వేడుకలకు స్పందించడం అరుదు. కానీ, విజయ్-రష్మిక(Vijay-Rashmika) జంటకు ప్రధాని స్వయంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాయడం ఇప్పుడు నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక వివాహ ఆహ్వానం అందడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీ లెటర్లో చెప్పారు. దేవరకొండ, రశ్మిక మందన్న కుటుంబాలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న మోదీ.. సప్తపది ద్వారా మీరిద్దరూ జీవిత భాగస్వాములు కాబోతున్నారని. మీ కలలను, బాధ్యతలను సమానంగా పంచుకుంటూ ముందుకు సాగాలని తన లేఖలో అన్నారు. మోదీ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
ప్రధాని మోదీ పంపిన ఈ లెటర్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీనిపై 70 శాతం మంది పాజిటివ్‌గా స్పందిస్తుండగా, 30 శాతం మంది ట్రోలింగ్ షురూ చేసేశారు.
సోషల్ మీడియాలో #ModiBlessesVirosh అనే హ్యాష్ ట్యాగ్ ఏకంగా 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. ప్రధాని నుంచ ఇలాంటి సందేశం రావడం అరుదైన గౌరవమని, సప్తపది గురించి మోదీ రాసిన మాటలు మనసు తాకేలా ఉన్నాయని లక్షలాది మంది లైక్స్, కామెంట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు,అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు కూడా ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు.

మరోవైపు పొలిటికల్ ట్రోల్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రధాని సెలబ్రిటీల పెళ్లిళ్లకు లేఖలు రాయడమేంటి? పేద ప్రజల సమస్యల సంగతేంటంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా మీమ్స్ రాయుళ్లు అయితే.. మోదీకి విజయ్ అంటే ఇష్టమా?అయితే ఇక విజయ్ ఫ్యాన్స్ అందరూ బీజేపీలో చేరిపోతారా అంటూ రకరకాల జోకులతో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు
కాగా ప్రధాని లేఖ ఒక ఎత్తయితే, ఈ పెళ్లి వేడుకకు అంబానీ కుటుంబం హాజరుకావడం మరో ఎత్తు. పారిశ్రామిక, సినీ దిగ్గజాల సమక్షంలో, రాజస్థాన్‌లో ఐటీసీ హోటల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈ వేడుక జరుగుతోంది. కేవలం 100 మంది అతిథులు మాత్రమే ఆహ్వానితులుగా ఉన్నారు.
ఇలా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ విజయ్, రశ్మిక పెళ్లికి సంబంధించిన ఫోటోల కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.అలాగే మరోవైపు హైదరాబాద్‌లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కోసం కూడా ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.



