Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..గీతా ఆర్ట్స్ ప్రత్యేక వీడియో
Pawan Kalyan:సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రీల్స్, వీడియోలు, ఫోటోలతో నిండిపోయింది.

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన 54వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ వర్గాల నుంచి, అలాగే దేశవ్యాప్తంగా, విదేశాలలోనూ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పుట్టినరోజును ఒక పండుగలా జరుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రెండు రోజుల ముందు నుంచే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందడి మొదలైంది. ఏ ఇతర రాజకీయ నాయకుడికీ, లేదా సినీ హీరోకి లేనంతగా, ఆయన పేరు, గోత్రం, నక్షత్రం ఉన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ పూజలు చేయించడం వైరల్ అయింది. ఇది ఆయనకు అభిమానులు కాకుండా, భక్తులు ఉన్నారని మరోసారి రుజువు చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు, ఆయనకు సంబంధించిన రీల్స్, వీడియోలు, ఫోటోలతో నిండిపోయింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో పవన్ సినిమాల్లోని ఐకానిక్ డైలాగులు, ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, అలాగే ఇతర సినీ ప్రముఖులు ఆయన గురించి చెప్పిన విషయాలు, రాజకీయ ప్రయాణం వంటివి అన్నీ పొందుపరిచారు.
ఈ వీడియో ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అనే బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్‌తో మొదలై, పవన్ కళ్యాణ్ సినీ జీవితంలోని ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, మరియు జనసేనతో ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, ప్రసంగాలు అన్నీ ఒకే చోట చూపించారు. ఇది అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. మొత్తంగా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సినీ, రాజకీయ రంగాల్లో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయాయి.
కాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తనదైన శైలి నటన, మేనరిజంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ లభించింది. ప
వన్ కళ్యాణ్(Pawan Kalyan)కు కేవలం అభిమానులు కాదని, భక్తులు ఉన్నారని అనేక మంది సెలబ్రిటీలు కూడా చెబుతూ ఉంటారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన పార్టీని స్థాపించి, గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు
2 Comments