Just EntertainmentLatest News

Rajamouli:షారుఖ్ కొడుకు తొలి సిరీస్‌లో రాజమౌళి..ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ట్రైలర్‌ సంచలనం

Rajamouli: ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Rajamouli

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, వెండితెరపై హీరోగా కాకుండా, దర్శకుడిగా తన తొలి అడుగు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతను డైరక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ట్రైలర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

సాధారణంగా పెద్ద స్టార్ కిడ్స్ తమ తొలి సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోనే విడుదల చేస్తారు. అయితే, ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్‌ను ఎంచుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజెంట్ ఓటీటీ అనేది విభిన్నమైన కథాంశాలను, కొత్త దర్శకులను ప్రోత్సహించే ఒక పెద్ద ప్లాట్‌ఫారమ్. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీపై సెటైరికల్ అండ్ కామెడీగా క్రియేట్ చేసిన ఈ సిరీస్‌కు ఓటీటీ సరైన వేదిక అని ఆర్యన్ భావించినట్లు తెలుస్తోంది.

Rajamouli
Rajamouli

ఒక సినిమాకు పోలిస్తే, వెబ్ సిరీస్‌కు కథాంశాన్ని మరింత డీటెయిల్డ్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఆర్యన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దర్శకుడిగా తన సత్తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఓటీటీ సిరీస్ సరైన మార్గం. ఇది సక్సెస్ అయితే, ఫ్యూచర్లో అతను డైరెక్ట్ చేసే సినిమాలకు ఒక బలమైన పునాది ఏర్పడుతుందని క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ విశేషాలు..ఈ సిరీస్ హిందీ సినీ పరిశ్రమలోని అంతర్గత విషయాలను, దాని లోపాలను సెటైరికల్‌గా చూపిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సిరీస్ కోసం భారీ క్యాస్ట్‌ను తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో గెస్ట్ రోల్స్ పోషించారు. వీరందరిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) కూడా ఈ సిరీస్‌లో ఒక ముఖ్యమైన పాత్ర(Rajamouli)లో కనిపిస్తారు. ఇది భారత సినీ ప్రపంచంలోనే ఒక అరుదైన కలయిక అని చెప్పవచ్చు.

ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. షారుఖ్ ఖాన్ కుమారుడు కావడంతో ఈ సిరీస్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను ఆర్యన్ ఖాన్ ఎంతవరకు అందుకుంటాడు, దర్శకుడిగా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాలంటే, సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.

Robot judges: రోబో జడ్జిలు వస్తున్నారు.. మెషిన్ల తీర్పులో సరైన న్యాయం సాధ్యమేనా?

 

Related Articles

Back to top button