Just EntertainmentLatest News

Prabhas: స్పిరిట్‌ మూవీ గురించి సందీప్‌ రెడ్డి వంగా క్రేజీ అప్ డేట్

Prabhas:సందీప్‌ రెడ్డి వంగా తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తారు. షూటింగ్‌ ప్రారంభం కాకముందే సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ (BGM)ను పూర్తి చేయడం ఆయన స్టైల్‌

Prabhas

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘స్పిరిట్‌’ గురించి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘యానిమల్‌’ వంటి సంచలన విజయం తర్వాత సందీప్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పనులు మొదలుపెడతామని ఆయన ప్రకటించారు.

సందీప్‌ రెడ్డి వంగా తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తారు. షూటింగ్‌ ప్రారంభం కాకముందే సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ (BGM)ను పూర్తి చేయడం ఆయన స్టైల్‌. ‘స్పిరిట్‌’ కోసం ఇప్పటికే 70 శాతం బీజీఎమ్‌ వర్క్‌ పూర్తయిందని సందీప్‌ తెలిపారు. గతంలో ‘యానిమల్‌’ సినిమాకు కూడా షూటింగ్‌కు ముందు 80 శాతం బీజీఎమ్‌ పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఈ పద్ధతి వల్ల సీన్‌కు ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో ముందే తెలుస్తుందని, సమయంతో పాటు నిర్మాణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తుండగా, ఆయన యానిమల్‌, రావణాసుర వంటి సినిమాలకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి క్రేజ్ ఉంది.

Prabhas
Prabhas

ప్రభాస్‌(Prabhas)తో కలిసి పనిచేయడంపై సందీప్‌ మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో (Prabhas)నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన ఈ సినిమాకు సహకరించారు. ఆయనలో పాన్‌ ఇండియా స్టార్‌ అనే ఫీలింగ్‌ ఏ మాత్రం కనిపించదు. చాలా స్నేహపూర్వకంగా ఉంటారు’ అని ప్రశంసించారు. త్వరలోనే ప్రభాస్‌తో కలిసి అధికారికంగా సినిమా గురించి ప్రకటన చేస్తామని కూడా చెప్పారు.

‘స్పిరిట్‌’ చిత్రంలో ప్రభాస్‌ ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా కథలో ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందని, ఆ భాగంలో ప్రభాస్‌(Prabhas) మాఫియా డాన్‌గా కనిపించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను టీ-సిరీస్ సంస్థ అధినేత భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్‌ వంగా స్టైల్‌కు తగ్గట్టుగా, ఈ సినిమా చాలా పవర్‌ఫుల్‌గా, యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన, భిన్నమైన చిత్రంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Beer:వైన్స్‌కి వెళ్లాల్సిన పనిలేదు..ఇకపై హోటల్స్, రెస్టారెంట్లలోనూ బీర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button