Tollywood: టాలీవుడ్‌కు టెంపరరీ బ్రేక్..
Tollywood: టాలీవుడ్ షూటింగ్స్ బంద్.. అసలేమయింది?

Tollywood
టాలీవుడ్ (tollywood) ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ ఎదురయింది. ఈరోజు నుంచి ఆర్డర్స్‌తో నడుస్తున్న సినిమా సెట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. షూటింగ్‌లు లేవు.. కెమెరాలు ఆగిపోయాయి.
ఎందుకంటే ఇండస్ట్రీలో కీలకంగా పనిచేసే కార్మికులు, టెక్నీషియన్లు తమ డైలీ వేతనాల్లో కనీసం 30 శాతం పెంపు కావాలంటూ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తీరనపుడు… వారు బహిరంగంగా ధర్నాకు దిగారు. ఫెడరేషన్ ఆదేశాలతో షూటింగ్స్ బంద్‌కు వెళ్లారు.
ఇంతకాలంగా అదే వేతనం. కానీ ఇప్పుడు భారం అధికం. పెట్రోల్, ఇంటి అద్దె, తినే ఆహారం దాకా పెరిగిపోతే… పాత జీతంతో ఎలా జీవించగలం?” అంటూ మేకప్‌మెన్ నుంచి డ్రైవర్ దాకా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఇంకా స్పష్టత లేకపోవడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేతనాల విషయంలో న్యాయం జరగాలి. లేకపోతే షూటింగ్‌కి రావడం లేదని స్పష్టం చేశారు.

ఈ బంద్ ప్రభావం పలు పెద్ద సినిమాలపై పడుతోంది.ముఖ్యంగా OG, సలార్, దేవర (ఎన్‌టీఆర్),పుష్ప 2 (అల్లు అర్జున్),సూర్య 43, మరికొన్ని చిన్న సినిమాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ సినిమాల షూటింగ్(shooting)లకు సంబంధించిన డేట్స్, లొకేషన్స్, ఆర్టిస్టుల డేట్స్ అన్నీ అయిపోయినా..సెట్స్‌లో పని మాత్రం ఆగిపోయింది.
కొంతమంది నిర్మాతలు బంద్ వల్ల నష్టపోతున్నామని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం డైరెక్ట్‌గా 30% పెంపుని అంగీకరించి తమ సినిమాల షూటింగ్ కొనసాగించేందుకు రెడీ అయ్యారు.
అయితే ఫిల్మ్ ఛాంబర్ ,ఫెడరేషన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఒకవేళ సర్దుబాటు జరిగితేనే షూటింగ్‌లు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పటివరకు టాలీవుడ్(Tollywood)కు టెంపరరీ బ్రేక్ తప్పదు.
2 Comments