Just EntertainmentLatest News

Review:ది రాజాసాబ్ రివ్యూ.. ప్రభాస్ ,మారుతి ‘మైండ్ గేమ్’ ప్రేక్షకులను మెప్పించిందా?

Review: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ ఫాంటసీ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.

Review

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరక్టర్ మారుతి తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ ఫాంటసీ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన రివ్యూలో (Review) చూద్దాం

ఈ కథ ఏమిటంటే.. రాజు (ప్రభాస్) ఒక సాదాసీదా కుర్రాడు. తన నానమ్మ గంగమ్మ (జరీనా వాహబ్) కోరిక తీర్చడం కోసం తన తాత కనకరాజు (సంజయ్ దత్) అన్వేషణలో బయలుదేరుతాడు. ఇలా వెళ్లినపుడు భైరవి (మాళవిక మోహనన్) పరిచయం అవ్వడం, వారంతా కలిసి ఒక అడవిలో ఉన్న పాత కోటకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ వెళ్లాక తన తాత చనిపోయి దెయ్యంగా మారాడని రాజుకు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఆ కోటలో ఉన్న రహస్యాలేంటి, తన తాత ఆత్మ నుంచి తన కుటుంబాన్ని రాజు ఎలా కాపాడుకున్నాడు అనేదే అసలు కథ.

దర్శకుడు మారుతి ఈ సినిమాను కేవలం హారర్ కామెడీ అని చెప్పినా కూడా, ఇది ఒక పక్కా సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ మార్క్ కామెడీ, రొమాంటిక్ సీన్లతో సరదాగా సాగిపోయింది. అయితే సెకండ్ హాఫ్ అంతా మైండ్ గేమ్ తో నడుస్తుంది. తాత దెయ్యం ఇచ్చే టాస్కులు, వాటిని రాజు ఎదుర్కొనే విధానం ఆసక్తికరంగానే ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కామన్ ఆడియన్స్‌కు కాస్త కొత్తగా అనిపించినా, కథలోని డెప్త్ మాత్రం ఈ మూవీని కాపాడుతుందనే చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది.

The Raja Saab
The Raja Saab

ఇక ప్రభాస్ చాలా కాలం తర్వాత తనలోని పాత కామెడీ టైమింగ్‌ను బయటకు తీసి మార్కులు కొట్టేశారు. క్లైమాక్స్ సీన్లలో డార్లింగ్ యాక్షన్ అద్భుతమనే చెప్పొచ్చు. సంజయ్ దత్ తాత పాత్రలో భయపెట్టడమే కాకుండా గంభీరంగా నటించారు. మాళవిక మోహనన్ గ్లామర్ , యాక్షన్ తో బానే మెప్పించగా, నిధి అగర్వాల్ ఉన్నంతలో బాగానే చేసింది. సత్య, సప్తగిరి కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. జరీనా వాహబ్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యారు.

అలాగే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్ లాగా నిలిచింది. హారర్ సీన్లలో వచ్చే శబ్దాలు ప్రేక్షకులను భయపెడతాయి. సినిమాటోగ్రఫీ , సెట్టింగ్స్ చాలా రిచ్ గానే ఉన్నాయి. అయితే వీఎఫ్ఎక్స్ (VFX) లో కొన్ని లోపాలు కనిపిస్తాయి. సినిమా చూస్తున్నపుడు ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేదని అన్పిస్తాది. మారుతి తన మార్క్ కామెడీని పక్కన పెట్టి ఒక ప్రయోగాత్మక కథను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి.

మొత్తంగా ది రాజాసాబ్ ప్రభాస్ నుంచి వచ్చిన ఒక సరికొత్త ప్రయోగంగా చూడొచ్చు. కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే కాకుండా, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఛాయిస్. మారుతి రాసుకున్న సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మూవీని మరో లెవల్ కు తీసుకెళ్లింది.

రేటింగ్.. 2.75 / 5

Space:అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ.. 25 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా ఎందుకయింది?

 

Related Articles

Back to top button