Just InternationalLatest News

America:హద్దు మీరుతున్న అమెరికా ..అంతర్జాతీయ చట్టాలంటే లెక్కలేదా ?

America: వెనుజులా నుంచి సాయుధ దాడి లేకపోయినా ఐరాస అనుమతి ఇవ్వకున్నా.. అమెరికా దాడికి దిగింది.

America

వెనుజులా ప్రజల భవిష్యత్తు ఇకపై వాషింగ్టన్ చేతుల్లో ఉండబోతోంది. అవును..వినడానికి ఇది షాకింగ్ గా ఉన్నా ఇదే జరగడం ఖాయమై పోయింది. ఒక విధంగా చెప్పాలంటే వెనిజులా స్వాతంత్య్రం కోల్పోయిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అదే సమయంలో మదురో నుంచి విముక్తి పొందామన్న ఆనందం అక్కడి చాలా మందిలోనూ కనిపిస్తోంది.

అయితే ఓవరాల్ గా ఇక్కడ చెప్పుకోవాల్సింది అమెరికా(America) ఆధిపత్యం గురించే. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాలు అమెరికాకు చుట్టాలుగా మారిపోయాయి. అందుకే అంతర్జాతీయ చట్టాలంటే అమెరికాకు లెక్కే లేకుండా పోయింది. కొంతకాలంగా ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలు , చేస్తున్న పనులే దీనికి ఉదాహరణ.

America
America

నిజానికి ఐక్యరాజ్యసమితి చట్టాల ప్రకారం ఒక దేశంపై మరొక దేశం దాడి చేయకూడదు. కానీ వెనుజులా నుంచి సాయుధ దాడి లేకపోయినా ఐరాస అనుమతి ఇవ్వకున్నా.. అమెరికా దాడికి దిగింది. ఇది నూటికి నూరు శాతం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని అంతర్జాతీయ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వెనుజులా ప్రెసిడెంట్ ను బందీగా పట్టుకోవడాన్ని అమెరికా సమర్థించుకుంటోంది. నికోలస్ మదురో డ్రగ్స్ ముఠాలకు నాయకుడని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా మోపిన అభియోగాలకు సంబంధించి మదురోపై చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ దేశ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే.

అమెరికా(America) అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం లేదన్న మాట నిజమే. అదే సమయంలో అగ్రరాజ్యంపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికా చర్యలను నిరసిస్తూ ఐరాస అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. తీర్మానం ప్రవేశపెట్టాలని కొన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికాకు ( America) వీటో పవర్ ఉంది. వీటో పవర్‌తో ఉన్న అమెరికాపై అలాంటి తీర్మానం తీసుకురావడం అంత సులభం కాదు. అంతేకాదు అగ్రరాజ్యంపై ఆంక్షలు అమలు చేయడం అస్సలు కుదిరే పని కూడా కాదు. ఇతర దేశాలు ఐక్యరాజ్యసమితిలో సమావేశాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపినా సరే.. అమెరికాకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ అమెరికా అత్యంత శక్తివంతం కావడమే దీనికి కారణం. కొన్ని నెలలుగా ట్రంప్ చాలా దేశాలపై విధిస్తున్న టారిఫ్ లు, ఇతర ఆంక్షలు, వీసాలకు కఠినమైన రూల్స్ ఇవన్నీఅమెరికా పవర్ ను ప్రపంచానికి చూపిస్తున్నాయి.

Smartphone:సైబర్ నేరాల నుంచి మీ స్మార్ట్ ఫోన్‌ను కాపాడుకోండి.. ఈ సెక్యూరిటీ టిప్స్ మీ కోసమే!

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button