Chataka Bird : ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగే ఈ పక్షి ఎంత ప్రత్యేకమో..
Chataka Bird : చాతక పక్షి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది తన జీవిత కాలంలో భూమిపై నదులు, కుంటలు, చెరువులు లేదా ఇతర జలాశయాల్లోని నీటిని ఒక్కసారి కూడా ముట్టదు.
Chataka Bird
ఈ భూమిపై రకరకాల అద్భుతమైన జంతువులు, చెట్లు, పక్షులు ఉన్నాయి. అయితే వాటిల్లో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీరు తాగే ప్రాణి ఒకటి ఉందట! ఈ అద్భుతమైన పక్షి గురించి 99 శాతం మందికి తెలియదు, దాని పేరు కూడా చాలా మందికి కొత్తే. ఆ పక్షి పేరే చాతక పక్షి, దీనినే వాన కోయిల అని కూడా పిలుస్తారు.
చాతక పక్షి (Chataka Bird) ప్రత్యేకతలు..
చాతక పక్షి(Chataka Bird)కి సంబంధించి పురాణాలలో, ప్రకృతిలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చాతక పక్షి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది తన జీవిత కాలంలో భూమిపై నదులు, కుంటలు, చెరువులు లేదా ఇతర జలాశయాల్లోని నీటిని ఒక్కసారి కూడా ముట్టదు.
ఈ (Chataka Bird)పక్షి వర్షాకాలంలోనే కనిపిస్తుంది అలాగే స్వాతి నక్షత్రంలో వచ్చే వర్షపు చినుకులను మాత్రమే తాగుతుందట. ఆకాశం నుంచి జాలువారే మొదటి వర్షపు చుక్కను ఇది నేరుగా తాగుతుంది. ఆ తర్వాత మళ్లీ ఏడాది వరకు నీరు తాగకుండా నిరీక్షిస్తుంది. అందుకే ఈ పక్షిని చూసి మనం ఓర్పు, సహనం నేర్చుకోవాలని చెబుతారు. ఈ పక్షి ఎల్లప్పుడూ ఆకాశం వైపు ముఖం పెట్టి వర్షం కోసం వేచి చూస్తూ ఉంటుంది.
కోకిల లాగే ఈ చాతక పక్షి కూడా కోయిల జాతికి చెందింది. దీనికి గూళ్లు కట్టడం రాదు. అందుకని ఇది వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెట్టేస్తుంది.

ఈ చాతక పక్షి ఒక వలస పక్షి (Migratory Bird). ఇది వర్షాకాలం సమీపిస్తోందనడానికి ఒక సంకేతం. వర్షాకాలం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇది వర్షాకాలంలో ఆఫ్రికా నుంచి భారతదేశానికి వలస వస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత తిరిగి ఆఫ్రికాకు వెళ్లిపోతుంది. ఇది కీటకాలను తింటూ జీవిస్తుంది.
ఈ పక్షిని ఆశ మరియు నిరీక్షణకు చిహ్నంగా భావిస్తారు. ఈ పక్షి రంగు నలుపు, తెలుపు కలగలిసి ఉంటుంది. అలాగే దాని తలపై ఒక కోణాల ఆకారంలో ఉండే చిహ్నం ఉంటుంది. అందుకే ఈ పక్షి చాలా అందంగా కనిపిస్తుంది.
ఈ పక్షి జలాశయాలు, నదులు, గుబురు ప్రదేశాల్లో విహరిస్తుందని, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు జలాశయం వద్ద ఇవి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.



