Just InternationalJust Crime

Miss Golf:ఆధ్యాత్మిక క్షేత్రంలో బ్యూటీ ట్రాప్

Miss Golf: ఓ ఆధ్యాత్మిక క్షేత్రంలో అవాక్కయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన కాషాయ వస్త్రాల మాటున నడిచిన ఓ చీకటి కథ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

Miss Golf:థాయ్‌లాండ్ (Thailand)ఆధ్యాత్మిక క్షేత్రంలో అవాక్కయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన కాషాయ వస్త్రాల మాటున నడిచిన ఓ చీకటి కథ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మిస్ గోల్ఫ్'(Miss Golf) అని పోలీసులు పిలుస్తున్న ఒక యువతి.. సాక్షాత్తు 9 మంది బౌద్ధ సన్యాసులను తన అందాల వలలో చిక్కుకుపోయేలా చేసింది. సన్యసించి, లోక బంధాలను త్యజించిన వారనుకున్న ఆ ఆధ్యాత్మిక గురువులు, ఆమె కాంత దాసులయ్యారన్న సంఘటన అందరినీ షాక్‌లో పడేసింది.

 

Miss Golf

‘మిస్ గోల్ఫ్’ కేవలం ఫిజికల్ రిలేషన్‌కే పరిమితం కాలేదు. ఆ సన్యాసులు తనతో ఏకాంతంగా గడిపిన క్షణాలను తన కెమెరా కంట్లో బంధించింది. అలా తీసిన ఫోటోలు, వీడియోలను ఆమె తన పెట్టుబడులుగా మార్చుకుంది. మూడేళ్లలోనే సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేసి ఏకంగా రూ. 102 కోట్లు వసూలు చేసిందంటే పోలీసులే కంగుతిన్నారు. పోలీసులు ఆమె ఇంటిని సోదా చేయగా, 80,000కు పైగా ఆ బ్లాక్‌మెయిల్ చేసే రుజువులు దొరకడం చూసి దర్యాప్తు అధికారులు కూడా షాక్ అయ్యారు

ఈ ఘటన థాయ్‌లాండ్ బౌద్ధ సమాజంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే లైంగిక వేధింపులు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి కేసులతో సన్యాసులు వార్తల్లో నిలుస్తున్న ఈ సమయంలో, ఈ ‘మిస్ గోల్ఫ్’ ఎపిసోడ్ వారి ప్రతిష్టను మరింత పాతాళానికి తోసేసింది.

ఒక సన్యాసి సన్యాసాన్ని వదులుకోవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 2024 మే నెలలో ‘మిస్ గోల్ఫ్’ ఒక సన్యాసితో సంబంధం పెట్టుకుంది. వారికి ఒక బిడ్డ కూడా పుట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఆమె అసలు రూపం బయటపడింది. బిడ్డ పోషణ ఖర్చుల పేరుతో రూ. 1.81 కోట్లు డిమాండ్ చేస్తూ, ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

పోలీసుల దర్యాప్తులో, ఆమె ఇదే తరహాలో మరికొందరు సన్యాసుల నుంచి కూడా డబ్బు గుంజిందని తేలింది. ఆ డబ్బులో కొంత భాగాన్ని ఆమె జూదంలో పోగొట్టిందని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం ‘మిస్ గోల్ఫ్’పై మనీలాండరింగ్, దోపిడీ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ, సంఘ సుప్రీం కౌన్సిల్ సీరియస్‌గా స్పందించింది. సన్యాసుల నియమ నిబంధనలను తిరిగి సమీక్షిస్తామని ప్రకటించింది. కాషాయం కప్పుకున్నంత మాత్రాన కామం అదుపులో ఉండదని, మనిషిలోని బలహీనతలు మత సంస్థలనూ వదలవని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

అయితే మతపరమైన సంస్థల్లో, ఆశ్రమాల్లో, మఠాల్లో ఇలాంటి నైతిక ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, భారతదేశంలో కూడా గతంలో అనేకసార్లు వెలుగు చూశాయి.

స్వామి ప్రేమానంద కేసు: 1990లలో తమిళనాడుకు చెందిన స్వామి ప్రేమానంద(Swami Premananda)పై అత్యాచారం, హత్య ఆరోపణలు వచ్చాయి. అతని ఆశ్రమంలోని మహిళలపై లైంగిక వేధింపులు, ఒకరి హత్య కేసులో అతను దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించాడు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గుర్‌మీత్ రామ్ రహీమ్ సింగ్ కేసు: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్‌మీత్ రామ్ రహీమ్ సింగ్ కూడా తన ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2017లో కోర్టు అతన్ని దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు వెలువడినప్పుడు పెద్ద ఎత్తున హింస చెలరేగింది.

బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసు: కేరళకు చెందిన రోమన్ క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై ఒక నన్ అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది, మత సంస్థల్లోని లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇది ఒక ఉదాహరణగా మారింది.

దేవదాసి వ్యవస్థ దుర్వినియోగం: కొన్ని ప్రాంతాల్లో ప్రాచీన దేవదాసి వ్యవస్థ పేరుతో బాలికలను ఆలయాలకు అంకితం చేసి, ఆ తర్వాత వారిని లైంగికంగా దోపిడీ చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇది మతపరమైన ఆచారం పేరుతో జరిగిన దుర్వినియోగం.

ఇలాంటి ఘటనలు సమాజంలో మత సంస్థల నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఆధ్యాత్మిక నాయకులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లేలా చేస్తాయి. మత సంస్థల్లో ఎన్‌హాన్స్‌డ్ అబ్జర్వేషన్, క్లారిటీ, రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఈ సంఘటనలు నొక్కి చెబుతున్నాయి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button