Toothbrushes: టూత్ బ్రష్‌లను మొదట దేంతో తయారు చేశారో తెలుసా?
Toothbrushes: నేటి ఆధునిక ప్రపంచంలో టూత్ బ్రష్‌లు, పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం రోజూ ఉదయం సులభంగా పళ్లు తోముకుంటున్నాము.

Toothbrushes
నేటి ఆధునిక ప్రపంచంలో టూత్ బ్రష్‌లు(Toothbrushes), పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం రోజూ ఉదయం సులభంగా పళ్లు తోముకుంటున్నాము. అయితే, మన పూర్వీకులు దంత శుభ్రత కోసం వేప పుల్లలు, బొగ్గు వంటి సహజ పదార్థాలను ఉపయోగించేవారు. ఆ తర్వాత కాలక్రమేణా టూత్ బ్రష్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, మొట్టమొదటి సారి టూత్ బ్రష్‌ను దేనితో తయారు చేశారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా టూత్ బ్రష్‌లను తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
మొట్టమొదటి సారి టూత్ బ్రష్‌లను తయారు చేసింది చైనా. చరిత్రకారుల ప్రకారం, 1498లో చైనాకు చెందిన ఒక రాజు ఈ టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలను ఉపయోగించి తయారు చేశాడట. పంది మెడ వెనుకాల ఉండే మందపాటి, దృఢమైన వెంట్రుకలను సేకరించి, వాటిని ఒక వెదురు కర్రకు లేదా ఎముకకు కట్టి బ్రష్‌లను తయారు చేశారట. ఈ వెంట్రుకలు బ్రషింగ్ కోసం సరిపడా దృఢంగా ఉండేవట.
చైనాలో తయారైన ఈ పంది వెంట్రుకల బ్రష్‌లను యూరప్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేశారట. ఈ కొత్త దంత శుభ్రతా పరికరం అప్పట్లో ఒక వినూత్న ఆవిష్కరణగా నిలిచింది.

ఆ తర్వాత కాలంలో, 1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియం ఆడిస్ (William Addis) అనే వ్యక్తి విజ్‌డమ్ టూత్ బ్రష్ (Wisdom Toothbrush) అనే కంపెనీని స్థాపించి టూత్ బ్రష్‌లను వాణిజ్యపరంగా తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆయన పంది ఎముకను హ్యాండిల్‌గా ఉపయోగించి, పంది వెంట్రుకలను బ్రష్‌గా అమర్చి వీటిని తయారు చేశాడు.
20వ శతాబ్దంలో, ముఖ్యంగా 1930లలో నైలాన్ వంటి సింథటిక్ ఫైబర్‌లు కనుగొనబడటంతో టూత్ బ్రష్ పరిశ్రమలో ఒక విప్లవం వచ్చింది. నైలాన్ బ్రష్‌లు పంది వెంట్రుకల కంటే పరిశుభ్రంగా, మృదువుగా మరియు తయారు చేయడానికి సులభంగా ఉండటంతో అవి త్వరగా ప్రాచుర్యం పొందాయి. అప్పటి నుంచి మనం నేడు చూస్తున్న ఆధునిక టూత్ బ్రష్‌లు అభివృద్ధి చెందాయి.
టూత్ బ్రష్ వంటి ఒక సాధారణ వస్తువుకు కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని తెలుసుకోవడం నిజంగా అద్భుతం, ఇది మానవజాతి పరిశుభ్రత పట్ల తీసుకున్న శ్రద్ధను తెలియజేస్తుంది.
Also Read: Diabetic retinopathy: మధుమేహం చూపును ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?