Trending:ట్రెండింగ్‌లో ఆ జడ్జి, ఈ లాయర్.. ఎందుకున్నారు? వాళ్లెవరు?
Trending:నిందితుల కంటే కూడా.. వాదనలు వినే జడ్జి, వాదించే లాయర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా అయిపోయారు.
Trending
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బందీగా పట్టుకున్నకేసు విచారణ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వెనిజులాపై మెరుపు దాడి చేసి మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న అమెరికా దళాలు తర్వాత ఫార్మాలటీస్ లో బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం మదురోను కోర్టులో హాజరుపరచగా.. కొన్ని నిమిషాలకే ఈ కేసును విచారిస్తున్న జడ్జి , మదురో తరపు లాయర్ ట్రెండింగ్ లో(Trending) నిలిచారు.

ప్రస్తుతం ఈ హైప్రొఫైల్ కేసు విచారణ మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో జరుగుతోంది. ఈ కేసులో నిందితుల కంటే కూడా.. వాదనలు వినే జడ్జి, వాదించే లాయర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా అయిపోయారు. ఫెడరల్ కోర్టు జడ్జి అల్విన్ హెల్లర్‌స్టీన్ ఈ కేసును విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 92 ఏళ్లు. అమెరికా న్యాయచరిత్రలో అత్యంత అనుభవమున్న న్యాయమూర్తిగా ఆయనకు పేరుంది.
గతంలో చాలా క్లిష్టమైన కేసులకు తీర్పులనిచ్చారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్న అల్విన్ కెరీర్ ఆరంభంలో ఆర్మీ లాయర్‌గా పని చేశారు. 1998లో అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఆయన్ని న్యాయమూర్తిగా నామినేట్ చేశారు. 2001 సెప్టెంబరులో న్యూయార్క్, వాషింగ్టన్ ట్విన్ టవర్స్ పై జరిగిన ఉగ్రదాడి కేసును ఆయనే విచారించారు.
అలాగే శృంగార తార హష్ మనీ కేసు విచారణను ఫెడరల్ కోర్టుకు మార్చామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చినప్పుడు సంచలనంగా మారారు. గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసును కూడా విచారిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి 2020లోనే మదురోపై అమెరికా అభియోగాలు మోపారు. అలాగే వెనిజులా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హ్యుగో ఆర్మాండో ఇదే కేసులో ఇప్పటికే దోషిగా తేల్చారు.
మరోవైపు ఇదే కేసులో నిందితుడు మదురో తరపు న్యాయవాది బారీ జె పోలక్ హాట్ టాపిక్ అయ్యారు. ఇటువంటి కేసుల్లో లాయర్ ఎంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అమెరికా లాంటి అగ్రదేశాన్ని వణికించి వాదించే సత్తా ఉన్న లాయర్ ఉండాల్సిందే. ఈ క్రమంలో మదురో తన తరపున వాదనలు వినిపించేందుకు బారీ జె.పోలక్‌ను నియమించుకున్నారు. గతంలో పోలక్ వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేను జైలు నుంచి విడిపించారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులను పలు క్లిష్టమైన కేసుల నుంచి కాపాడిన పోలక్ మదురో కేసులో ఎలాంటి వాదనలు వినిపిస్తారో చూడాలి.
stairs:మెట్ల కింద బీరువా లేదా పూజ గది ఉందా? వాస్తు ఏం చెబుతోంది?



