Coldest cities: ఊహకు అందని చలి.. ప్రపంచంలో అత్యంత చల్లని నగరాలు ఇవే!
Coldest cities: ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకు పడిపోయినా ప్రజలు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

Coldest cities
మానవ నివాసానికి అనుకూలం కాని వాతావరణంలో ప్రజలు ఎలా జీవిస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దగ్గర 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకే చలికి గజగజ వణుకుతాం. కానీ, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకు పడిపోయినా ప్రజలు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. అక్కడ చలిని తట్టుకోవాలంటే ప్రత్యేకమైన బట్టలు, వేడి కోసం నిరంతర ప్రయత్నాలు అవసరం. అలాంటి చలిని ధైర్యంగా ఎదుర్కొంటున్న ప్రపంచంలోని కొన్ని నగరాల గురించి ఇప్పుడు చూద్దాం.
రష్యాలోని ఒమైకాన్ ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశాల(coldest cities)లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ జనవరిలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. ఈ చలిలో అక్కడి ప్రజలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఒమైకాన్ పక్కనే ఉన్న వెర్కోయాన్స్ కూడా అతి చల్లని నగరాల్లో ఒకటి. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 68 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. ఈ విపరీతమైన చలికి ఇక్కడ రవాణా స్తంభించిపోతుంది. ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి 24 గంటలూ చలిమంటలు వేసుకుని జీవిస్తారు.

కజకిస్థాన్ రాజధాని అస్తానా (coldest cities)శీతాకాలంలో మైనస్ 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది. ఈ తీవ్రమైన చలికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడి నదుల్లోని నీరు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. ఇక మంగోలియా రాజధాని అయిన ఉలాన్‌బాతర్ కూడా అత్యంత చల్లని నగరాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రజలు చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి బొగ్గులతో నిప్పులను తయారు చేసుకుంటారు.
కెనడాలోని స్నాగ్(coldest cities) కూడా చలికి పెట్టింది పేరు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 63 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ పట్టణంలో ప్రజలు చలికాలంలో ఇళ్లలోనే ఉండిపోతారు. చైనాలోని హార్బిన్ నగరాన్ని ‘ఐస్ సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ జనవరి నెలలో మైనస్ 18, ఫిబ్రవరి నెలలో మైనస్ 14 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక్కడ ప్రతి ఏటా ఐస్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ నగరాల్లో జీన్స్, స్వెటర్స్, షూస్ ధరించకపోతే ఇంట్లో కూడా గజగజా వణికిపోతారు.
One Comment