Just International

Eve Jobs : ఎవరీ ఈవ్ జాబ్స్ ? ఈ ట్రెండ్ సెట్టర్ స్టోరీ ఏంటి ?

Eve Jobs : ఇన్స్పిరేషన్‌కు కేరాఫ్ గా నిలబడుతూ ఈవ్ జాబ్స్ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది.

Eve Jobs : స్టీవ్ జాబ్స్.. ఆ పేరు అందరికీ తెలిసిందే. ఆపిల్ కింగ్‌గా ప్రపంచదేశాలకు ఆయన సుపరిచితుడు. కానీ గ్రేట్ డాడీ ఉన్నా.. తన కాళ్లమీద తాను బతుకుతూ సంథింగ్ స్పెషల్‌ అన్పించుకుంటోంది.. స్టీవ్ జాబ్స్ గారాలపట్టి ఈవ్ జాబ్స్(Eve Jobs ). ఇన్స్పిరేషన్‌కు కేరాఫ్ గా నిలబడుతూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది. సాధారణంగా బిలియన్ల ఆస్తుల మధ్య, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికే చూస్తారు. కానీ ఈవ్ మాత్రం అలాంటిది కాదు.

Eve Jobs

తన తండ్రి ఇచ్చిన ఆ పేరు, ఆ వారసత్వం.. అన్నీ పక్కన పెట్టేసి, టెక్ వరల్డ్‌కి దూరంగా ఈవ్ తనకంటూ ఓ కొత్త బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంది. స్వయంకృషితో, తన ప్యాషన్‌తో సంపాదించుకుంటూ.. ఇప్పుడు యూత్‌కి ఒక బిగ్ రోల్ మోడల్‌గా నిలిచింది.

ఈవ్ జాబ్స్ కాలిఫోర్నియాలో 1998లో పుట్టింది. స్టీవ్ జాబ్స్ (Steve Jobs), లారెన్ పావెల్ జాబ్స్ దంపతుల చిన్న కూతురిగా, ఆమె తల్లి ఎప్పుడూ తన పిల్లలు కేవలం ఫ్యామిలీ నేమ్ వల్ల వచ్చే ఫేమ్ కాకుండా, నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని బలంగా కోరుకుంది. మమ్మీ-డాడీల డ్రీమ్‌ని నిజం చేస్తూ, ఈవ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ చేసినా, ఆమె ఇంట్రెస్ట్స్ మాత్రం టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్నాయి. ఆమెకు మూవ్‌మెంట్, బ్యూటీ, క్రియేటివిటీ అంటే పిచ్చి.

హార్స్ రైడింగ్ నుంచి ఫ్యాషన్ గ్లామర్ వరకు కూడా ఈవ్ ఓ వెలుగు వెలిగింది. ఈవ్ జాబ్స్ మోడలింగ్ లోకి రాకముందే, గుర్రపు స్వారీలో అల్టిమేట్ పర్ఫామెన్స్ తో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. గుర్రాలు అంటే ఆమెకు ప్రాణం. ఈ ప్యాషన్‌నే తన కెరీర్‌గా మలుచుకుని, 2019 నాటికి 25 ఏళ్ల లోపు రైడర్లలో ప్రపంచంలోనే టాప్ 5లో నిలిచి అందరినీ షాక్ చేసింది.

హార్స్ రైడింగ్‌లో తనకంటూ ఒక స్ట్రాంగ్ ప్లేస్ దక్కించుకున్న తర్వాత, ఈవ్ ఫ్యాషన్ వరల్డ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2020లో గ్లోసియర్ అనే పాపులర్ బ్యూటీ బ్రాండ్‌తో మోడలింగ్‌లో తొలిసారి కనిపించి అందరితో వావ్ అన్పించుకుంది.తర్వాత, డీఎన్ఏ మోడల్ మేనేజ్‌మెంట్తో టై అప్ అయ్యి, పారిస్ ఫ్యాషన్ వీక్‌తో సహా చాలా పెద్ద ఫ్యాషన్ షోలలో పాల్గొని, ఇంటర్నేషనల్ లెవెల్‌లో మోడల్‌(Model)గా తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని సంపాదించుకుంది. ఈవ్.. మోడలింగ్ ప్రపంచానికి ఒక న్యూ ట్రెండ్‌ని సెట్ చేసిందని ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఈవ్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించదు. ప్రైవసీకి ఆమె చాలా వాల్యూ ఇస్తుంది. అయితే ఈవ్ జాబ్స్ నెట్ వర్త్ ఎంత అనేది అఫీషియల్‌గా తెలియదు. అయితే, ఆమె మోడలింగ్, గుర్రపు స్వారీ ద్వారా 500,000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.4.16 కోట్ల నుంచి రూ.8.33 కోట్లు మధ్య సంపాదించిందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆమె తల్లి లారెన్ పావెల్ జాబ్స్, తమ పిల్లలకు భారీ వారసత్వాలను ఇవ్వబోమని పబ్లిక్‌గా చెప్పారు.స్టీవ్ జాబ్స్ ఫ్యామిలీ డబ్బు సంపాదించడం కంటే, డొనేట్ చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈవ్ జాబ్స్ జర్నీ కేవలం ఆమె పర్సనల్ సక్సెస్ మాత్రమే కాదు. ఇది యూత్‌కి, ముఖ్యంగా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ఒక ఇన్స్పిరేషన్, ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్. వారసత్వం అనేది ఒక ఆప్షన్ మాత్రమే అని, తమ డ్రీమ్స్‌ని ఓన్ గా ఫాలో అయ్యి, వాటిని రియల్ చేసుకోవచ్చని ఆమె ప్రూవ్ చేసింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button