Chopta:చౌప్తాకు ట్రిప్ ప్లాన్ చేస్తారా?.. తక్కువ బడ్జెట్లోనే ఫారెన్ అనుభూతినిచ్చే బెస్ట్ ప్లేస్ ఇదేనట..
Chopta: డిసెంబర్, జనవరిలో వెళ్తే మొత్తం మంచుతో నిండిపోయి స్విట్జర్లాండ్ ను తలపిస్తుంది.
Chopta
చాలామందికి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి మంచు కొండలను, పచ్చని మైదానాలను చూడాలని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుందని మనసులో కోరికను చంపుకుంటారు.
అయితే మన దేశంలోనే, అచ్చం స్విట్జర్లాండ్ లాగే ఉండే ఒక అద్భుతమైన ప్రాంతం ఉందని చాలామందికి తెలీదు. ఉత్తరాఖండ్‌లోని ‘చౌప్తా’ (Chopta)ని ‘మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారట.
రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 8,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం.. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం అనే చెప్పొచ్చు. చౌప్తాలో ఎటు చూసినా పచ్చని పచ్చిక బయళ్లు (Bugyals), వాటి వెనుక మంచుతో నిండిన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి.

ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ‘తుంగనాథ్’ ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ‘చంద్రశిల’ శిఖరం కనిపిస్తుంది, అక్కడి నుంచి హిమాలయాల 360 డిగ్రీల వ్యూ చూడొచ్చు.
అలాగే ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి చౌప్తా( Chopta) బెస్ట్ స్పాట్. డిసెంబర్, జనవరిలో వెళ్తే మొత్తం మంచుతో నిండిపోయి స్విట్జర్లాండ్ ను తలపిస్తుంది. ఢిల్లీ లేదా హరిద్వార్ నుంచి రోడ్డు మార్గంలో ఈజీగా చేరుకోవచ్చు. హోటల్స్ కంటే ఇక్కడ టెంట్లలో స్టే చేయడం ఒక కొత్త అనుభూతినిస్తుంది. తక్కువ ఖర్చుతో విదేశీ అనుభూతిని పొందాలనుకునే వారికి చౌప్తా ఒక సరైన ప్లేస్ అవుతుంది.
Dhanurmasam:సంక్రాంతికి ముందు వచ్చే ధనుర్మాసం విశిష్టత తెలుసా? ఈ సమయంలో ఎవరిని పూజించాలి?



