Just LifestyleHealthLatest News

Cold Water:మీకు తెలుసా? యవ్వనంగా కనిపించడానికి చన్నీళ్లే బెస్ట్ మెడిసిన్ అని ..

Cold Water: చన్నీళ్లు చర్మాన్ని తేమగా ఉంచడంలో, స్కిన్‌ను టైట్ చేయడంలో ది బెస్ట్‌ అన్నట్లుగా ఉంటాయి.

Cold Water

మనం ఫేస్ అందంగా, గ్లోగా ఉండటం కోసం ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ కోసం వేల రూపాయలను ఖర్చు చేస్తాం. కానీ మన ఇంట్లోనే చన్నీళ్ల(Cold Water)తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ బ్యూటీ పార్లర్ ఇవ్వలేదంటున్నారు నిపుణులు. దీనినే కోల్డ్ వాటర్ థెరపీ అంటారని చెబుతున్నారు.

మనం చన్నీళ్లతో ముఖం కడుక్కున్నప్పుడు, చర్మంపై ఉన్న రంధ్రాలు (Pores) మూసుకుపోతాయి. దీనివల్ల చర్మం బిగుతుగా (Tight) మారుతుంది. ఇది సహజమైన యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది.

చన్నీళ్లు చర్మంపై రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి, దీంతో ముఖంపైన సహజమైన మెరుపు (Glow) వస్తుంది. వేడి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని సహజ నూనెలు పోయి పొడిబారుతుంది. కానీ చన్నీళ్లు చర్మాన్ని తేమగా ఉంచడంలో ది బెస్ట్‌ అన్నట్లుగా ఉంటాయి.

Cold Water
Cold Water

రోజూ ఉదయాన్నే ఐస్ వాటర్‌తో కానీ చల్లటి నీళ్ల(Cold Water)తో కానీ ముఖాన్ని కడుక్కోవాలి. వీలయితే ఒక బౌల్‌లో నీళ్లు నింపి ,అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి 10 సెకన్ల పాటు ముఖాన్ని అందులో ఉంచడం (Ice Facial) వల్ల కళ్ల కింద వాపు (Puffy Eyes) తగ్గుతుంది. ఫేస్ కూడా టైట్ అవుతుంది.

ఇలా తరచూ చేస్తే ఒత్తిడిని తగ్గించి మీకు ఆ రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుంది. కెమికల్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Ishan Kishan : ఇషాన్ కిషన్ ఊచకోత..చివరి టీ20 టీమిండియాదే

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button