Stage fright: స్టేజ్ ఫియర్ ఇలా వదిలించుకోండి..
Stage fright: స్పీచ్ ఇవ్వడానికి భయంగా ఉంటే, మాట్లాడాల్సిన విషయాన్ని ముందుగా పేపర్ మీద రాసుకొని, దాన్ని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ లాంగ్వేజ్, మాటతీరు, తప్పులు మీకు స్పష్టంగా తెలుస్తాయి

Stage fright
అందరిలో గలగలా మాట్లాడేవారు కూడా స్టేజ‌్ మీదకు వెళ్లి మాట్లాడాలంటే వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే స్టేజ‌్(Stage fright)పై మాట్లాడటం వారికి భయం. కానీ, అనర్గళంగా, ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. మీ మాటతీరు, ఆత్మవిశ్వాసం బట్టే మీపై ఇతరులకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. స్టేజ్ ఫియర్ (stage fright)లేకుండా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడాలంటే ఈ సులభమైన సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
వేదికపైకి వెళ్లే ముందు మీరు మాట్లాడాల్సిన విషయంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మీరు చెప్పబోయే అంశం గురించి లోతుగా అధ్యయనం చేయండి. ఏదైనా క్లిష్టమైన విషయం అయితే, దానిని చిన్న చిన్న పాయింట్లుగా విభజించుకోండి. దీనివల్ల విషయాన్ని సులభంగా, స్పష్టంగా వివరించవచ్చు. మీ ప్రసంగంలోని ముఖ్యమైన పాయింట్లను ఒక పేపర్‌పై రాసుకుంటే, ఏది మర్చిపోకుండా గుర్తుంచుకోవచ్చు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
స్పీచ్ ఇవ్వడానికి భయంగా ఉంటే, మాట్లాడాల్సిన విషయాన్ని ముందుగా పేపర్ మీద రాసుకొని, దాన్ని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాడీ లాంగ్వేజ్, మాటతీరు, తప్పులు మీకు స్పష్టంగా తెలుస్తాయి. మీరు ఎలా కనిపిస్తున్నారో, మీ హావభావాలు ఎలా ఉన్నాయో గమనించవచ్చు. ఇది నిజమైన వేదికపై మాట్లాడిన అనుభవాన్ని ఇస్తుంది. అలాగే, మీకు తెలిసిన విషయాలను స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోండి.

ఆత్మవిశ్వాసం అనేది వేదికపై మాట్లాడటానికి (public speaking)చాలా ముఖ్యం. నేను ఏదైనా నేర్చుకోగలను, చేయగలననే నమ్మకాన్ని మీలో పెంచుకోండి. వాక్చాతుర్యం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని బలంగా నమ్మండి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే, ఎలాంటి భయం లేకుండా వేదికపై ఆకట్టుకునేలా ప్రసంగం చేయవచ్చు.
కొన్నిసార్లు వేదికపైకి వెళ్లినప్పుడు, ఒత్తిడి (Stage fright)వల్ల మీరు మాట్లాడాల్సిన అంశాన్ని మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా, మీతో పాటు ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. మీకు ఏదైనా గుర్తురాకపోతే, మెల్లిగా నీరు తాగుతూ ఉండండి. దీనివల్ల మీకు గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం సమయం దొరుకుతుంది. ఈ చిన్న టెక్నిక్ మీలో ఆత్మనూన్యతా భావాన్ని తగ్గించి, ప్రసంగాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. వేదికపై మాట్లాడటం అనేది నిరంతర సాధనతో మెరుగుపడే నైపుణ్యం. ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు కూడా గొప్ప వక్త అవడం గ్యారంటీ.